కొందరు రోజురోజు స్నానం చేస్తేనే వారి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటిది వారు సంవత్సరానికోసారి స్నానం చేస్తారంటా.. అయినా కానీ వారి దగ్గరి నుంచి సుగంధ వాసనే కానీ.. దుర్వాసన రాదంట. ఇంతకీ వారు ఎక్కడ, ఎవరు అనుకుంటున్నారా..! నమీబియాలో హింబా తెగకు చెందిన వారు ఏడాదికి ఒకసారి.. అది కూడా వారి పెళ్లిరోజున మాత్రమే స్నానం చేస్తారు. అయితే.. వారి ఆచారం ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఆ తెగకు చెందిన జనాలు చెబుతున్నారు.
Rahul Gandhi: జై శ్రీరామ్, మోడీ నినాదాలు, బంగాళాదుంపలతో రాహుల్ గాంధీకి స్వాగతం..
కొన్ని చోట్ల ఆచార, సంప్రదాలు భిన్నంగా ఉంటాయి. ఇవి చూస్తే మాత్రం నోటి వెంబడి మాట రాదు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హింబా తెగ ప్రజలు స్నానం చేసే పద్ధతిలో ఒక విచిత్రమైన ఆచారం పాటిస్తున్నారు. ఈ తెగ ప్రజలు ఏడాదికి ఒక్కరోజు స్నానం చేస్తారు. అది కూడా తమ పెళ్లిరోజున మాత్రమే శుభ్రంగా స్నానం చేస్తారు. అయితే అక్కడ ఉన్న హింబా తెగలో దాదాపు యూభై వేల మంది వరకు గిరిజనులు ఉన్నారు.
Calcutta: కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. ఏ పార్టీలో చేరనున్నారంటే..!
వారు స్నానం చేసే ఒక్కరోజు మాత్రం అడవి నుంచి సేకరించిన కొన్ని పరిమిళ ద్రవ్యాలను నిప్పులలో వేస్తారు. దీంతో సువాసనతో కూడిన పొగ వస్తుంది. ఈ పొగ తమ శరీరానికి పోయేలా చేస్తారు. దాంతో వారి శరీరం నుంచి చెడు వాసన అనేది రాదని చెబుతున్నారు. ఈ స్నానం చేశాక.. ఒంట్లో నుంచి ప్రత్యేకమైన సువాసన వస్తుదంటున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. కీటకాలు, పురుగులు కూడా వారి దగ్గరకు రావంట. అందుకే ఏడాదికోసారి మాత్రమే స్నానం చేస్తూ.. మిగతా రోజుల్లో ఆడ, మగ తేడాలేకుండా ఇలా వెరైటీగా పొగ స్నానం చేస్తూ శుభ్రంగా ఉంటారంట. దీంతో వీరి ఒంట్లో నుంచి అస్సలు స్మెల్ రాదంట.
