సూర్యకుమార్ యాదవ్ అంటే గ్రౌండ్ లో ఉన్నంత సేపు బాల్ ఎటు పోతుందో అన్నట్లు ఆడటం తన స్టైల్. అందుకే తనను అభిమానులు మిస్టర్ 360 అని కూడా అంటారు. అయితే వరల్డ్ కప్ 2023లో ప్లేయింగ్ ఎలెవన్ లో స్థానం సంపాదించుకున్న మాట వాస్తవమే కానీ.. ఇంతవరకు ఏ మ్యాచ్ ల్లో అతను ఆడలేదు. జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉండటం వల్ల తనకు అవకాశాలు లభించడం లేదు. అయితే సూర్య డగౌట్ లో కూర్చుని ఏదో తింటున్న వీడియో సోషల్ మీడియాలో చాలా తొందరగా వైరల్ అయ్యింది.
Read Also: TCS: జాబ్ చేయలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆ కంపెనీలో 40వేల మందికి ఫ్రెషర్లకు ఛాన్స్
ఆ వీడియోపై ఓ అభిమాని స్పందిస్తూ కామెంట్ చేశాడు. “సార్, మీరు డగౌట్‌లో కూర్చుని ఏమి తింటున్నారు, గ్రౌండ్‌కి వెళ్లి సిక్స్‌లు కొట్టండి” అని రాశాడు. అయితే దానికి సూర్యకుమార్ యాదవ్ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “నేనేమీ తింటే మీకేందుకు.. మీకు కావాలంటే దయచేసి స్విగ్గీకి ఆర్డర్ ఇవ్వండి బ్రదర్” అని రాశాడు. అయితే సూర్య సమాధానానికి అభిమానులు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. మీమ్‌ను భాగస్వామ్యం చేస్తున్నప్పుడు, ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, “సర్, మీరు మాత్రమే ఈ ఆర్డర్‌ని పూర్తి చేయగలరు, స్విగ్గీ కాదు.” అలాగే సూర్య సమాధానంపై కూడా చాలా మంది స్పందించారు.
Order mereko nahi Swiggy pe de bhai https://t.co/ggeOOIRODp
— Surya Kumar Yadav (@surya_14kumar) October 16, 2023
Read Also: Olympics: ఒలింపిక్స్ 2028లో క్రికెట్ ప్రవేశంపై తుది నిర్ణయం.. అధికారిక ప్రకటన వెల్లడి
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడగా.. మూడింటిలోనూ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై, రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై, మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించింది. ఇక తర్వాతి మ్యాచ్ పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది.