సాధారణంగా వర్షాకాలం చలికాలంలో పాములు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. కొందరు పాములను చూస్తేనే భయపడి పారిపోతుంటారు. అయితే.. ఒకేసారి ఒకే ప్లేస్ లో మూడు పాములు కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. అయితే ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఒక వర్క్‌షాప్‌లో మూడు పాములు ఒకే చోట ప్రత్యక్షం కావడంతో అక్కడి కార్మికులు షాకయ్యారు. వాటిని చూసిన వెంటనే భయంతో బయటికి పరుగులు తీశారు.అనంతరం షాప్ యజమానికి, స్నేక్ క్యాచర్ శివానికి సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న శివాని వెంటనే ఎంతో చాకచక్యంగా మూడు పాములను పట్టేసింది.అనంతరం వాటిని ఓ అడవిలో వదిలిపెట్టింది.
ఈ ఘటనను చూసేందుకు అక్కడి కార్మికులు, గ్రామస్తులు పెద్దఎత్తున గుమికూడారు. పాములను పట్టుకునే సమయంలో శివాని చూపిన ధైర్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడున్న వారు ఈ మొత్తం దృశ్యాలను మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శివాని సాహసాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
“ఈ కాలంలో పాములు ఎక్కువగా బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు స్నేక్ క్యాచర్ శివాని. ముఖ్యంగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు పాముల సంభోగకాలం. ఆడ పాముల వాసనను పసిగట్టి మగ పాములు ఒకేచోట గుమికూడడం సాధారణమని ఆమె అన్నారు. అందుకే ఒంటరి ప్రదేశాలు, చిత్తడి గుహలు, చీకటి మూలలలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి” అని ప్రజలను ఆమె హెచ్చరించింది.