Site icon NTV Telugu

Smriti and Palash: స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ఒకే ఎమోజీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?

Mandana

Mandana

Smriti and Palash: టీమిండియా మహిళల జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన, మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌ పెళ్లి వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో వారు వివాహాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ప్రచారానికి స్మృతి-పలాశ్‌ దిష్టి రక్ష ఎమోజీతో చెక్‌ పెట్టేశారు. వారిద్దరూ తాజాగా తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బయోలో దిష్టి రక్ష ఎమోజీని యాడ్ చేశారు. దీంతో వారి మధ్య ఎలాంటి గొడవలు లేవనే విషయంపై క్లారిటీ ఇచ్చినట్లైంది.

Read Also: Off The Record: హిల్ట్ పాలసీపై ఎంపీలు రియాక్ట్ అవకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయా ?

అయితే, ఇటీవల స్మృతి మంధాన ఇన్‌స్టా్గ్రామ్ ఖాతాలో పెళ్లికి సంబంధించిన పోస్టులు మాయం కావడంతో సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. పలాశ్‌ ముచ్చల్‌తో ఎంగేజ్‌మెంట్‌ను ధ్రువీకరిస్తూ.. ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపిస్తూ స్మృతి పోస్టు చేసిన వీడియో ఆమె ఇన్‌స్టా అకౌంట్ లో కనిపించలేదు. ఇదే వీడియోను స్మృతి ఫ్రెండ్స్ జెమీమా రోడిక్స్, శ్రేయాంకలు కూడా తమ సోషల్‌ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో పలాశ్‌కు, ఆమెకు మధ్య మనస్పర్థలు వచ్చాయనే న్యూస్ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో ప్రచారం కొనసాగింది. అదే సమయంలో పలాశ్‌ ముచ్చల్‌ మరో అమ్మాయితో మంధానను కించపరిచేలా చాట్‌ చేసినట్లు ఆరోపిస్తున్న స్క్రీన్‌షాట్లు ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్ష్యం కావడంతో వైరల్‌గా మారింది.

Read Also: Off The Record: జిల్లాలో అగ్గి రాజేసిన డీసీసీ నియామకం.. పంచాయతీ ఎన్నికల్లో నష్టమంటున్న కేడర్

ఇక, శుక్రవారం నాడు పలాశ్‌ ముచ్చల్ తల్లి అమిత ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ.. ఇప్పుడు అంతా బాగానే ఉంది.. త్వరలో పలాశ్‌ ముచ్చల్‌- స్మృతి మంధాన వివాహం జరుగుతుందని తేల్చి చెప్పింది. స్మృతి, పలాశ్‌ ఇద్దరూ ప్రస్తుతం కష్టాల్లోనే ఉన్నారు. స్మృతిని తన అర్థంగిగా త్వరలోనే మా ఇంటికి తీసుకురావాలని పలాశ్ కలలు కన్నాడు.. నేను కూడా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాను.. ఇప్పుడంతా బాగానే ఉంది.. వారిద్దరి పెళ్లి అతి త్వరలో జరగబోతుందని ఆమె వెల్లడించారు. ఈ సమయంలో స్మృతి మంధాన-పలాశ్‌ ముచ్చల్ తమ ఇన్‌స్టా బయోలో దిష్ట రక్ష ఎమోజీని పోస్టులను అప్‌డేట్‌ చేయడం గమనార్హం.

Exit mobile version