NTV Telugu Site icon

పెళ్లిళ్ల‌లో దావ‌త్‌, బ‌రాత్‌పై నిషేధం… నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే…

పెళ్లిళ్లు అంటే ఎలాంటి హ‌డావుడి ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పెళ్లికి ముందు దావ‌త్ చేసుకుంటారు. అదేవిధంగా డ్యాన్సులు, హంగామా ఉంటుంది. ఆ తంతు జ‌రిగే స‌మ‌యంలో చాలా పెళ్లిళ్ల‌లో గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. పెళ్లి ఖ‌ర్చులు పెరిగిపోతున్న త‌రుణంలో ఈ తంతు కార‌ణంగా అద‌నంగా బోలెడు ఖ‌ర్చులు అవుతుండ‌టంతో రాజ‌స్తాన్‌లోని గోడీ తేజ్‌పూర్ అనే గ్రామం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పెళ్లిళ్ల‌లో దావ‌త్‌, డీజే, బ‌రాత్‌ల‌ను నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. గ్రామంలోని మాజీ, ప్ర‌స్తుత స‌ర్పంచ్‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై గ్రామంలో జ‌రిగే పెళ్లిళ్ల‌లో మందు, డీజే, డ్యాన్సులు పెట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌లో గ్రామ‌స్తులంతా సంత‌కాలు చేశారు. ఈ రిజిస్ట్రేష‌న్ కాపీని థ‌న్‌పూర్ పోలీసుల‌కు అందించారు. గ్రామంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించి పెళ్లిళ్ల‌లో మ‌ద్యం సేవిస్తే రూ. 21 వేలు, డీజే, నృత్యాలు ఏర్పాటు చేస్తు రూ. 51 వేలు జ‌రిమానా విధిస్తామ‌ని గ్రామ‌పెద్ద‌లు పెర్కొన్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read: హీరోయిన్నీ మోసం చేసిన నిర్మాత.. అరెస్ట్ చేసిన పోలీసులు