Site icon NTV Telugu

Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

Amazon Bucket

Amazon Bucket

ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఏ చిన్న వస్తువు అయినా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం వంటి ఈ కామర్స్ సంస్థలు ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో రాజ్యమేలుతున్నాయి. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో ఓ నీటి బక్కెట్ ధర చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. దీంతో సదరు బక్కెట్ ధర గురించి అమెజాన్‌ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

బాత్‌రూమ్‌లో వాడుకునే సాధారణ నీటి బకెట్ ధరను అమెజాన్ వెబ్‌సైట్‌లో రూ.25,999గా పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తొలుత ఓ పింక్ కలర్ బకెట్ ధర రూ.35,900 ఉండగా.. అమెజాన్ దానిపై 28శాతం డిస్కౌంట్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో ఆ బక్కెట్ ధర కాస్త రూ.25,999కే లభిస్తోందని అమెజాన్ ప్రకటించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రొడక్ట్‌కు ‘నో కాస్ట్ ఈఎంఐ’ ఉండదని అమెజాన్ తెలిపింది. అయితే బక్కెట్ స్టాక్‌లో లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీఅంత ధర పెట్టి బకెట్ ఎవరు కొంటున్నారో తెలియడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Amazon

Exit mobile version