Site icon NTV Telugu

Viral News: సినిమా థియేటర్‌లో ఫ్రీ పాప్‌కార్న్.. ఏకంగా డ్రమ్ము నిండా తీసుకెళ్లిన వ్యక్తి ( వీడియో)

Viral Video1

Viral Video1

సినిమా హాలులో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ తాగడం అందరికీ ఇష్టం. కానీ లోపల వాటి ధరలు మాత్రం మామూలుగా ఉండవు. బయటి ఫుడ్‌ని కూడా థియోటర్‌లోకి తీసుకెళ్ల నివ్వరు. దీని కారణంగా చాలా సార్లు జనాలు రహస్యంగా బయటి ఫుడ్ తీసుకువస్తారు. కానీ సౌదీ అరేబియాలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో సినిమా థియేటర్‌లోకి పెద్ద డ్రమ్ములు, బకెట్లతో వస్తున్నారు. నిజానికి ఇదంతా జరగడానికి కారణం థియోటర్‌లో ఉచితంగా పాప్‌కార్న్ కంటైనర్ ఇస్తామని ప్రకటించడమే.

REDA MORE: Graduate MLC: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. సాయంత్రం ప్రచారానికి తెర

డైలాగ్ పాకిస్థాన్ అనే హ్యాండిల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోలో తెల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి షాపింగ్ సెంటర్‌లోని సినిమా హాల్ వైపు వెళ్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. అతను ఈ నీలిరంగు డ్రమ్ తీసుకొని పాప్‌కార్న్ కౌంటర్ వద్దకు చేరుకున్నాడు. అతన్ని చూసి అక్కడ ఉన్న సిబ్బంది నవ్వడం ప్రారంభించారు. వెంటనే సిబ్బంది డ్రమ్ తీసుకుని పాప్‌కార్న్‌తో నింపి తిరిగి ఇస్తారు. వాస్తవానికి ఈ వీడియో జనవరి నెలలో పోస్ట్ చేశారు. కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. సినిమా హాల్లో30 రియాల్స్ కు అంటే దాదాపు రూ. 696 కు అపరిమిత పాప్‌కార్న్ ఇస్తామని ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.

REDA MORE: AAI Recruitment 2025: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి

Exit mobile version