Viral News: వామ్మో.. కిలో టీ పొడి ధర అక్షరాలా రూ.లక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయం లేవగానే అందరికీ టీ తాగడం అలవాటు. సాధారణంగా టీ ధర రూ.10 లేదా రూ.20 ఉంటుంది. పెద్ద రెస్టారెంట్లు, కాఫీ షాపుల్లో అయితే టీ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇళ్లలో వాడుకునే టీ పొడి కిలో సుమారుగా రూ.300 ఉంటుంది. కానీ అసోంలో లభించే పభోజన్ గోల్డ్ టీ ధర వింటే మీరు ఆశ్చర్యపోతారు. తాజాగా అసోంలో లభించే పభోజన్ గోల్డ్ టీ పొడిని వేలం వేయగా మంచి ధర దక్కింది. జోర్హాట్‌లో జరిగిన ఈ వేలంలో పభోజన్ టీ పొడి ధర కిలోకు రూ.లక్ష వరకు పలికింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరగా వ్యాపారులు చెబుతున్నారు.
గోలఘాట్ జిల్లాలో పభోజన్ బ్రాండ్‌కు చెందిన సేంద్రీయ టీ ఉత్పత్తి అవుతోంది. పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ నుంచి అసోంకు చెందిన ‘ఎసా టీ’ ఈ టీ పొడిని కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఈ టీ పొడికి మంచి డిమాండ్ ఉందంట. పభోజన్ గోల్డ్ టీ ఇతర టీల కంటే రుచిగా, ప్రత్యేకంగా ఉంటుందంట. ఒక్కసారి ఈ టీ తాగితే మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుందని అక్కడివారు చెబుతున్నారు. దీనిని ఇష్టపడే వారు అంతర్జాతీయంగా చాలామంది ఉన్నారని.. అందుకే ఈ టీ పొడిని టీ బ్రాండ్ ‘ఎసా టీ’ సంస్థ కొనుగోలు చేసింది. మరోవైపు అసోంలో తేయాకు ఎక్కువగా సాగవుతుంది. ఇక్కడే పండే తేయాతో పలు రకాల టీ పొడులను తయారు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు.
దీంతో పభోజన్ టీ పొడికి పలికిన ధరను చూసి స్థానికులే అవాక్కవుతున్నారు.
Also Read
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
- Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!