NTV Telugu Site icon

Noida: బీఎండబ్ల్యూ కారులో వచ్చి.. పూల కుండీ దొంగిలించిన మహిళ (వీడియో)

Viral Video

Viral Video

నోయిడాలో ఓ మహిళ బీఎండబ్ల్యూ కారు నుంచి దిగి పూల కుండీని దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఓ దుకాణం బయట ఉంచిన పూల కుండీని దొంగిలిస్తున్న మహిళను కొందరు అడ్డుకోగా.. ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.

READ MORE: Devendra Fadnavis: లోక్‌సభ ఎన్నికల వలే ఓట్ జీహాద్ ఈసారి పనిచేయదు..

ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 18కి చెందినది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. మహిళ పూల కుండిని దొంగిలిస్తున్నప్పుడు.. కొందరు వ్యక్తులు వచ్చి ఆమె కారు దగ్గర నిలబడ్డారు. ఆ మహిళ బీఎండబ్ల్యూ నుంచి మెల్లగా బయటకు వచ్చి నేరుగా పూల కుండీ ఉంచిన దుకాణం వైపు వెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నిర్భయంగా కుండను తీయడం ప్రారంభించి, దానిని తీసుకొని కారులో ఉంచుతుంది. ఈ సమయంలో.. అక్కడ నిలబడి ఉన్న కొందరు ఈ సంఘటనను గమనించి అతని కారు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. కొంతమంది అడ్డుకోవడంతో ఆ మహిళ బదులిచ్చిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

READ MORE:Delhi: ఢిల్లీలో చైనీస్ మొబైల్ జామర్ల రికవరీ.. భద్రతా సంస్థలు అప్రమత్తం

“నేను రోజూ పూల కుండీ తీసుకుంటాను.” అని సమాధానమిచ్చింది. ఈ మహిళ ఇప్పటి వరకు రెండు పూల కుండీలను దొంగిలించినట్లు సమాచారం కూడా వెలుగులోకి వస్తోంది. ఈ సంఘటన తర్వాత.. వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ప్రజలు దీనిపై వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. మహిళ ప్రవర్తనపై కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఈ ఘటనపై పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Show comments