Viral News: కడుపుకోతతో పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని ఎవరూ ఓదార్చినా.. వారిని హత్తుకుని.. వారి బాధ వెళ్లిపోయేలా ఏడ్చేస్తుంటారు.. కొన్నిసార్లు ఆ బాధ కాస్త తగ్గినట్టు అనిపించినా.. కొన్నిసందర్భాల్లో వారిన మరింత కుంగదీస్తుంది.. ఇక, కొన్ని సందర్భాల్లో జంతులు, పక్షులు కూడా బాధలో ఉన్నవారినా ఓదార్చిన సందర్భాలు ఉన్నాయి.. తాజాగా, కుమారుడు మరణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లి వద్దకు వచ్చిన ఓ వానరం.. ఆ తల్లిని ఓదార్చింది. ఇక, తన కుమారుడే వానరం రూపంలో తన వద్దకు తిరిగి వచ్చాడని.. ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటు చేసుకుంది..
Read Also: Canada: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక
తాడిపూడి గ్రామానికి చెందిన యువకులు ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రోజు గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లారు.. అయితే, ప్రమాదవశాత్తు అనిశెట్టి పవన్, తిరుమలశెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, పడాల సాయి, గర్రే ఆకాష్ అనే ఐదుగురు యువకులు గోదావరిలో మునికి మృతి చెందారు. ఈ నేపథ్యంతో శనివారం దశదిన కర్మ కార్యక్రమాలను నిర్వహించారు ఆయా కుటుంబ సభ్యులు.. కాగా, పవన్ అనే యువకుడి ఇంటి వద్దకు ఒక వానరం వచ్చింది.. దుఃఖంలో ఉన్న పవన్ తల్లి రామలక్ష్మి వద్ద కూర్చుని వెళ్లింది. మరణించిన వారు ఏదో ఒక రూపంలో తిరిగి తమ అయిన వారి వద్దకు వస్తారు.. అనే మాట నిజమని ఈ దృశ్యం చూసిన స్థానికులు భావిస్తున్నారు.. మొత్తంగా దుఃఖంలో ఉన్న ఓ కన్నతల్లి వద్దకు వచ్చి.. కాసేపు ఉండి.. కౌగిలించుకుని.. ఆ తర్వాత ఆరు బయట చాలా సేపు ఉండివెళ్లింది ఆ వానరం.. స్థానికులు ఆ దృశ్యాలను మొబైల్స్‌లో బంధించడంతో.. ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారిపోయాయి..