NTV Telugu Site icon

మొతేరా స్టేడియంలో వర్షానికి మ్యాచ్ రద్దయ్యే అవకాశం చాలా తక్కువ..!

మొతేరా స్టేడియాన్ని అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో నిర్మించారు. ఇందులో ఔట్‌డోర్‌తో పాటు.. ఇండోర్‌ ప్రాక్టీస్‌ నెట్స్‌ కూడా ఉన్నాయి. రెండు ప్రాక్టీస్‌ గ్రౌండ్‌లు ఉండగా.. ఒకదాంట్లో 9, మరోదాంట్లో 11 పిచ్‌లు ఉన్నాయి. ఇక ప్రతి డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెండు జిమ్‌లు ఉన్నాయి. ఇవి విశాలంగా నిర్మించారు. ఇక ట్రైనర్స్‌, ఫిజియో, కోచ్‌ల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. 

వర్షం పడితే మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం ఇక నుంచి చాలా తక్కువ..! ఎందుకంటే మొతేరాలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంత భారీ వర్షం కురిసినా.. 30 నిమిషాల్లో గ్రౌండ్‌ ఆటకు సిద్ధంగా మారిపోతుంది. ఇక స్టేడియంలో ఉన్న 55 రూమ్‌ క్లబ్‌హౌస్‌లలో 3D మినీ థియేటర్లు ఉన్నాయి. ఒలింపిక్‌ సైజులో స్విమ్మింగ్‌పూల్స్‌, జిమ్‌లు ఉన్నాయి. ఇక ఈ స్టేడియంలో 3 వేల కార్లు, 10 బైక్‌లను పార్క్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ స్టేడియంలో లక్షా 10 వేల మంది కూర్చొని మ్యాచ్‌ చూడొచ్చు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో 90 వేల నుంచి లక్షా మంది సీటింగ్‌ కెపాసిటీ ఉంది. అందుకే వరల్డ్‌లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది..! అందుకే ఈ పింక్‌ బాల్‌ టెస్ట్‌పై క్రేజు పెరిగింది.