Site icon NTV Telugu

UP: జైలు నుంచి విడుదలై గేట్ ముందే డ్యాన్స్ చేసిన ఖైదీ.. వీడియో వైరల్

Updanse

Updanse

జైలు నుంచి విడుదలవ్వడమంటే ఏ ఖైదీకైనా సంతోషమే. నాలుగు గోడల మధ్య బందీ అయిపోయే.. కుటుంబానికి దూరమైపోవడం అంటే ఎవరికైనా బాధాకరమే. మొత్తానికి జైలు శిక్ష పూర్తి చేసుకుని చెరసాల నుంచి ఖైదీ బయటకు వచ్చాడు. ఆనందమో.. లేదంటే సంతోషమో.. లేదంటే తన టాలెంట్ చూపించాలనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. బయటకు రాగానే గేటు ముందే బ్రేక్ డ్యాన్స్ చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే.. అతగాడి డ్యా్న్స్‌ను జైలు సిబ్బంది చూసి ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: YS Jagan: తిరోగమనం వైపు ఏపీ.. ధ్వజమెత్తిన జగన్

కన్నౌజ్ ప్రాంతానికి చెందిన శివ.. ఓ దాడి కేసులో ఏడాది జైలు, రూ.1,000 జరిమానా పడింది. అయితే ఎన్జీవో సాయంతో తొమ్మిది నెలలకే జైలు నుంచి శివ విడుదలయ్యాడు. అయితే శివ జైలు నుంచి బయటకు రాగానే.. ఏమనుకున్నాడో తెలియదు గానీ.. ఉన్నట్టుండి బ్రేక్ డ్యాన్స్ చేశాడు. మైకేల్ జాక్సన్ మాదిరిగా స్టెప్పులు వేశాడు. అయితే ఈ డ్యాన్స్‌ను జైలు సిబ్బంది, న్యాయవాది వీక్షించారు. అయితే శివ స్నేహితుడు.. ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత టాలెంట్ పెట్టుకుని.. చిన్న చిన్న తప్పులు కారణంగా జైలు పాలయ్యాడంటూ కామెంట్ చేస్తున్నారు. అతగాడి టాలెంట్‌ను మీరు కూడా చూసేయండి.

ఇది కూడా చదవండి: Madhya Pradesh: మైనర్ బాలికపై అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం..

 

Exit mobile version