NTV Telugu Site icon

Trading leave letter: ఇదెక్కడి మాస్ లీవ్ లెటర్ రా మావా? రెండే ముక్కల్లో తేల్చేశాడు..

Trading Leave Letter

Trading Leave Letter

ఉద్యోగులు చాలా మర్యాదగా పని నుంచి సెలవు కోరుతూ అప్లికేషన్ మెయిల్ చేస్తారు. కానీ.. సోషల్ మీడియాలో ఓ లీవ్‌ మెయిల్ వైరల్ గా మారింది. అసలు ఆ మ్యాటర్ చదివితే ఇంతకి రిక్వెస్ట్ చేస్తున్నాడా? అర్డర్ వేస్తున్నాడా? అర్థం కాక నెత్తులు పట్టుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగంలోకి చేరాక సెలవు కావాలన్నా, అత్యవసర పరిస్థితి ఎదురై ఆఫీసు వదిలి వెళ్లాలన్నా బాస్‌ అనుమతి తప్పనిసరి. ఇలా సెలవు కావాలంటే సాధారణంగా టీమ్‌ లీడ్‌కి విషయం తెలపాలి. లీవ్ రావడం మంజూరు కోసం సరైన కారణంతో మెయిల్ లేదా మెసేజ్ పంపాలి. ఏది ఏమైనా కానీ బాస్‌ని మాత్రం రిక్వెస్ట్ చేయక తప్పదు. కానీ.. తక్కువ పదాలతో రాసిన మెయిల్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

READ MORE: Breakup: బ్రేకప్ తర్వాత మీ ఎక్స్‌ లవర్‌ని మర్చిపోలేకపోతున్నారా?

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా సిద్ధార్థ్‌ షా అనే వ్యక్తి ఓ పోస్ట్‌ చేశాడు. తన టీమ్‌ సభ్యుడు సెలవు కోరుతూ పంపిన మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను అందులో పంచుకున్నాడు. అందులో ‘‘హాయ్‌ సిద్ధార్థ్‌, నవంబర్‌ 8న సెలవు తీసుకుంటా. బాయ్‌’’ అని రాసుండడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కట్టె.. కొట్టె.. తెచ్చే అన్న చందంగా ఆ వ్యక్తి పంపిన మెయిల్ వైరల్ గా మారింది. బహుశా అతడు ముక్కుసూటి మనిషేమో. ఎలాంటి సుత్తి లేకుండా చాలా చక్కగా వివరించారని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ప్రస్తుతం యువతకు క్రమశిక్షణ, భయం, భక్తి లేనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

READ MORE: UP: కుటుంబీకులకు ఆహారంలో మత్తు మందు కలిపి.. పెళ్లయిన యువకుడితో అమ్మాయి జంప్

Show comments