Site icon NTV Telugu

Instagram Reel Stunt: రిల్స్ కోసమే రిస్క్? శంకర్‌పల్లిలో రైల్వే ట్రాక్ మీద కారు!

Shankarpally

Shankarpally

Instagram Reel Stunt: సోషల్ మీడియా ఫేమస్ కావడం కోసం కొందరు ఎంత వరకైనా వెళ్లడానికి రెడీగా ఉన్నారు. అందుకు తాజాగా జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా చెప్పుకోవాలి.. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని రైల్వే ట్రాక్‌పై ఓ యువతి కారు నడిపిన వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఆమె చేసిన పనికి రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: US: గాల్లో ఉండగా విమానంలో మంటలు.. సేఫ్‌గా ల్యాండింగ్.. వీడియో వైరల్

అయితే, శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ యువతి తన కారుతో వెళ్లిన వీడియో షూట్ చేసింది. ఇక, ఆమె స్నేహితుడు వీడియో తీస్తుండగా, సదరు యువతి కారును నెమ్మదిగా రైలు పట్టాలపై నడిపిస్తూ స్టైల్‌గా రీల్స్ తీసుకుంది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక, ఈ వాహనం రైల్వే ట్రాక్‌పై ఉండటంతో ఆ మార్గంలో రావాల్సిన రైళ్లు ఆలస్యం అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు – పలుసార్లు అనేక చోట్ల రైలు నెమ్మదిగా రావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version