NTV Telugu Site icon

Viral News: కాబోయే భార్య కోసం రూ. 55 లక్షలు ఖర్చు చేసిన భర్త.. చివరికీ..

Viral News

Viral News

ఏ వ్యక్తికైనా వివాహం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. పెళ్లి నిర్ణయం జీవితంపై ఆధారపడి ఉంటుంది. ఇకవేళ తప్పటడుగు వేస్తే జీవితాంతం భరించాల్సి ఉంటుంది. అలాంటి ఓ ఘటన చైనాలో జరిగింది. పెళ్లి కాకముందే ఓ చైనా వ్యక్తి మనోవేదనకు గురయ్యాడు. పెళ్లి గురించి ఆత్రుతగా ఉన్న అతను పెళ్లికి ముందే తన కాబోయే భార్య కోసం దాదాపు రూ.55 లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి ముందే పెళ్లయినట్లు తెలిసింది. దీంతో బిత్తర పోయాడు.

READ MORE: Sandhya Theatre Stampede: : ఇకపై నో బెనిఫిట్ షోలు.. టీ సర్కార్ షాకింగ్ నిర్ణయం

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. చైనాలోని హుబే ప్రావిన్స్‌లో నివసిస్తున్న షిన్ పెళ్లికి సంబంధించిన ప్రకటనను చూశాడు. షిన్‌కి షాయు అనే మహిళ పరిచయమైంది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొన్నాళ్లరు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. క్రమంగా ఆమె అబ్బాయి నుంచి డబ్బు అడగడం ప్రారంభించింది. చైనీస్ సంప్రదాయం ప్రకారం తాను వధువు కొంత చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో ఆ వ్యక్తి దాదాపు రూ.22 లక్షలు పంపాడు. అంతే కాకుండా కుటుంబ సభ్యుల అనారోగ్యాన్ని సాకుగా చూపి షిన్ నుంచి మరింత డబ్బు డిమాండ్ చేసింది. అతనికి సందేహం రాకుండా ఫోటోలు, వీడియోలు పంపేది. ఒక సంవత్సరం వ్యవధిలో దాదాపు రూ. 55 లక్షలను షాయుకు బదిలీ చేశాడు.

READ MORE: Elon Musk: ‘‘చేతకాని దద్దమ్మ’’..టెర్రర్ అటాక్‌పై జర్మనీ ఛాన్సలర్‌ని తిట్టిన మస్క్..

కొంతకాలం తర్వాత.. రెండు కుటుంబాలు కలిసే రోజు వచ్చింది. ఈ క్రమంలో షావోయును చూసి జిన్ ఆశ్చర్యపోయాడు. అతను ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తికి బయట కనిపించిన వ్యక్తికి చాలా మార్పు ఉన్నట్లు గమనించాడు. ఫిల్టర్ వల్లే అమ్మాయి అందంగా కనిపించింది. ఇప్పుడు ఆమె తనను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పంది. ఇది షిన్‌ను ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. జియోయుగా మాట్లాడుతున్న మహిళకు అప్పటికే పెళ్లయిందని, ఓ బిడ్డ కూడా ఉందని ఆ తర్వాత తేలింది. తాను మోసపోయానని గుర్తించిన వెంటనే షిన్ స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ముఠా మొత్తం పెళ్లి పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తుందని ఆ తర్వాత వెల్లడైంది.

Show comments