Site icon NTV Telugu

Glass Bridges: ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నగ్లాస్ వంతెన‌లు…

సాధార‌ణంగా వంతెన‌లు అంటే సిమెంట్‌, లేదా స్టీల్‌తో నిర్మిస్తుంటారు. రోడ్డును దాటేంగుకు పాద‌చారుల కోసం చాలా ప్రాంతాల్లో ఐర‌న్‌, స్టీల్‌తో నిర్మించిన వంతెన‌లు క‌నిపిస్తుంటాయి. వాహ‌నాలు ప్ర‌యాణం చేసేందుకు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తున్నారు. ఇవి అన్ని చోట్ల ఉండేవే. కానీ, కొన్ని వంతెన‌లు చాలా స్పెష‌ల్‌గా ఉంటాయి. అలాంటివే గ్లాస్ వంతెన‌లు. వంతెనల‌ను గ్లాస్‌తో నిర్మిస్తారు. ఇలాంటివి దేశంలో రెండు ఉన్నాయి. అందులో ఒక‌టి సిక్కింలో ఉన్న‌ది. సిక్కింలోని పెల్లింగ్ న‌గ‌రంలో ఈ గ్లాస్ వంతెన‌ను 2018లో నిర్మించారు. 137 అడుగుల ఎత్తైన చెన్రెజిగ్ విగ్ర‌హానికి కుడివైపున స‌ముద్ర‌మ‌ట్టానికి 7200 అడుగుల ఎత్తులో ఈ గ్లాస్ స్కూవాక్‌ను నిర్మించారు. ఇప్పుడు ఈశాన్య‌భార‌త దేశంలో నిర్మించిన ఈ స్కైవాక్‌ను సంద‌ర్శించేందుకు ప్ర‌తిఏటా ల‌క్ష‌లాది మంది ప‌ర్యాట‌కులు సిక్కిం లోని పెల్లింగ్‌కు వ‌స్తుంటార‌ట‌.

Read: Bihar: ఆ గ‌డియారాన్నిఎత్తుకెళ్లిన దొంగ‌లు…హైసెక్యూరిటీ ఉన్నా…

ఇక‌, ఇలాంటి స్కైవాక్ బ్రిడ్జి మ‌రోక‌టి బీహార్ రాష్ట్రంలో ఉంది. బీహార్‌లోరి రాజ్‌గిరిలో ఈ స్కైవాక్ ఉంది. భూమికి 250 అడుగుల ఎత్తులో ఈ గ్లాస్ స్కైవాక్‌ను నిర్మించారు. ఈ స్కైవాక్ పై నుంచి 360 డిగ్రీల కోణంలో రివ్యూ చేయ‌వ‌చ్చు. బీహార్‌లో నేచ‌ర్ పార్క్‌, జూస‌ఫారీతో పాటు ఈ గ్లాస్ స్కూవాక్ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ది.

Exit mobile version