NTV Telugu Site icon

Funny Video: సీరియల్‌లో ఈ సీన్ చూస్తే.. మీరు నవ్వు ఆపుకోలేరు..!!

Funny Vedio

Funny Vedio

Funny Video: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో మహిళలు సినిమాల కంటే సీరియల్స్‌ చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కానీ కొందరు సీరియల్స్‌ను అస్సలు చూడరు. ఇటీవల సీరియళ్లలో గ్రాఫిక్స్ బాగా వాడేస్తున్నారు. తాజాగా ఓ హిందీ సీరియల్‌లోని ఒక సన్నివేశం నెటిజన్లకు తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ సీన్‌లో హీరో, హీరోయిన్, విలన్ పతంగులు ఎగురవేస్తారు. హీరో బిల్డింగ్ పైనుంచి పడటంతో హీరోయిన్ కూడా దూకి హీరోను పట్టుకుని గాలిపటానికి ఉండే కట్టె పుళ్లలను పట్టుకుంటారు. ఈ సీన్ గ్రాఫిక్స్‌లో చేసినా గాలిపటం పుల్లను పట్టుకుని హీరో, హీరోయిన్ గాలిలో విహరించడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Read Also: Rambha Family Car Accident: హీరోయిన్ రంభ ఫ్యామిలీకి యాక్సిడెంట్.. పిల్లలతో వెళ్తుండగా ప్రమాదం

కాగా ఈ సన్నివేశం ఇష్క్ కి దస్తాన్ నాగమణి సీరియల్‌లోది. ఈ సీరియల్ దంగల్ టీవీలో ప్రసారమవుతోంది. గాలిపటం సన్నివేశాన్ని చూసి ఈ సీరియల్ తీసిన వారికి మైండ్ పనిచేయడం లేదని.. గ్రాఫిక్స్ చేయడంలోనూ లిమిట్స్ క్రాస్ చేసిందని నెటిజన్‌లు మండిపడుతున్నారు. ప్రేక్షకుల మనసు దోచేలా ఈ సన్నివేశాన్ని రాయాల్సింది బదులు నవ్వులపాలయ్యేలా రాసిన రచయిత ఏం తింటున్నాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అతడికి నిజంగా మెదడు దెబ్బతిని ఉండొచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.