కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్‌ను వినియోగిస్తున్నారు. గతంలో ఇలా మాస్క్ ధరిస్తే ఏదో వ్యాధితో బాధపడుతున్నారేమో అనుకునేవారు. కానీ, ఇప్పుడు మాస్క్ దరించకుంటే వారిని భిన్నంగా చూస్తున్నారు. మాస్క్ ధరించడం వలన కరోనా నుంచి రక్షణ పొందడమే కాదు, మహిళల ముఖాలు చాలా అందంగా మారిపోతాయని తాజా అధ్యయనంలో తేలింది. మాస్క్ ధరించడంపై యూకేలోని కార్డిఫ్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ సైకాలజీ శాస్త్రవేత్తలు అద్యయనం చేశారు. మాస్క్ వాడకంపై చేసిన అద్యయనంలో కీలక విషయాలను గుర్తించారు. ముఖంలోని దిగువ భాగంలో ధరించే మాస్క్ కారణంగా ముఖం అందంగా కనిపిస్తుందని తేలింది. ఇక నీలిరంగులో ఉండే మాస్క్‌లను ధరించడం వలన ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుందని వెల్లడయింది.
Read: రామ్ “ది వారియర్”… వార్ బిగిన్స్
మాస్కులు ధరించిన మహిళల ముఖాలు, మాస్కులు ధరించని ముఖ చిత్రాలను పరిశీలించి ఈ రిపోర్ట్‌ను ఇచ్చారు. నీలిరంగులో ఉండే సర్జికల్ మాస్క్‌లు ధరించడం వలన ముఖాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తామని కార్డిఫ్ యూనివర్శిటి పరిశోధకులు పేర్కొన్నారు. మాస్క్ ధరించిన వారి కళ్లు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయని తెలిపారు.