LOVE : ప్రేమ చూపించేందుకు మనకు అవకాశం రోజూ అవకాశం రాదు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన ఓ జంట భావోద్వేగాలతో నిండిన క్షణాలను మిగిలి ప్రపంచానికి చూపింది. ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ఉమ్ముల్ ఖైర ఫాతిమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కదిలిస్తోంది. వీడియోలో భార్య డెలివరీకి సిద్ధమవుతూ లేబర్ రూమ్‌లోకి వెళ్లే క్షణాల్లో భర్త ఆసుపత్రి సిబ్బంది ముందు ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నాడు. “నా భార్యను బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతటి వేదననో భరించాలి!” అన్న ఆలోచనతోనే అతను తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు.
“మీ భార్యను ఎంతగా ప్రేమిస్తారు?” అని డాక్టర్ అడిగినప్పుడు, అతను కన్నీరు పెడుతూ “చాలా ప్రేమిస్తా.. చాలా..” చెబుతున్న వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారింది. “డెలివరీ సమయంలో ఏడు లేయర్లు కట్ చేస్తారు.. ప్రతి భర్త ఇది తెలుసుకోవాలి” అంటూ డాక్టర్ ఫాతిమా ఈ వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్‌లో “ప్రతి అమ్మాయికి ఇలాంటి ప్రేమించే భర్త దక్కాలి.” అని రాశారు.
ఈ వైరల్ వీడియోను ఇప్పటికే 4 లక్షల మందికిపైగా లైక్ చేయగా, వేలాది మంది కామెంట్లు చేశారు. “ఇలాంటి పురుషులు నిజంగా జీవితంలో అందమైన వరం” అని ఓ నెటిజన్ కామెట్ పెట్టగా.. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ భావోద్వేగ వైబ్‌ను వ్యక్తపరుస్తూ.. ఇలాంటి పురుషులు జీవితం లో ప్రతి ఆనందానికి అర్హులు.” మరో వ్యక్తి రాశారు.. “కామన్‌గా చెప్పేది కాదు.. కానీ నా భర్త కూడా నన్ను లేబర్ రూమ్‌కి తీసుకెళ్తూ ఇలా ఏడ్చాడు.” అని మరొకరు.. “అమ్మాయిలు నిజంగా అదృష్టవంతులు ఇలాంటి భర్తలు దొరికితే.” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకరి బాధను మనది చేసుకుని కంట తడి పెట్టడం అనేది నిజమైన ప్రేమకు చిరునామా అనేది ఈ వీడియో మనకు గుర్తుచేస్తోంది.
Nimmala Rama Naidu: మహానాడు పనుల్లో బిజీగా మంత్రి నిమ్మల.. పార చేతపట్టి మరీ..!
