NTV Telugu Site icon

వైన్‌తో క‌రోనాకు చెక్ ..!?

గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆహార‌పు అల‌వాట్ల‌ను మార్చుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్లు, ఆహ‌రపు అల‌వాట్లు త‌దిత అంశాల‌పై శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ పరిశోధ‌న‌ల సారాంశాన్ని ఫ్రాంటియ‌ర్స్ ఇన్ న్యూట్రీష‌న్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. ఈ జ‌ర్న‌ల్ ప్ర‌కారం, వారానికి నాలుగు నుంచి 5 గ్లాసుల వ‌ర‌కు రెడ్ వైన్ తీసుకునేవారు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌టం 17 శాతం వ‌ర‌కు త‌క్కువుగా ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. అదే బీర్ లేదా పండ్ల ర‌సాలు తాగేవారు క‌రోనా రిస్క్ ఎక్కువ అని, 28 శాతం వ‌ర‌కు రిస్క్ ఉంటుంద‌ని నిపుణులు పేర్కొన్నారు. రెడ్ వైన్‌లో ఫాలిఫెనాల్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది.

Read: పెళ్లిలో చిచ్చుపెట్టిన పూల‌దండ‌… చివ‌ర‌కు…

ఇది శ్వాస‌కోశ జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా కాపాడటంలో స‌హాయ‌ప‌డుతుంది. అదేవిధంగా వైట్ వైన్ లేదా షాంపెన్ తీసుకునే వారిలో కూడా ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశం 8 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు పేర్కొన్నారు. బీర్ లేదా పండ్ల ర‌సాలు తీసుకునే వారిలో ఈ రిస్క్ అధికంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆల్కాహాల్ అధికంగా సేవించే వారిలో కూడా రిస్క్ అధికంగా ఉంటుంద‌ని నిపుణులు పేర్కొన్నారు.