NTV Telugu Site icon

Divorce Temple: విడాకులు కావాలంటే ఈ గుడికి వెళ్లండి.. ఎక్కడో తెలుసా..?

Divorce Temple

Divorce Temple

వరల్డ్ వైడ్ గా ఎన్నో ఆలయాలున్నాయి. వాటికి ప్రత్యేకతలు ఉంటాయి. రాహు-కేతు పరిహారమవ్వాలంటే శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ కి.. విదేశాలకు వెళ్లాలి వీసా రావాలంటే చిలుకూరు బాలాజీ ఆలయానికి.. వచ్చేస్తాయని నమ్మకం ఉంది. దీంతో ప్రపంచంలో ఉన్న ఎన్నో ఆలయాలకు మరెన్నో ప్రత్యేకతలున్నాయి. కానీ ఈ భూమిపై విడాకుల గుడి అనేది ఒకటి ఉంది అనే విషయం మీకు తెలుసా..? అసలు.. విడాకుల గుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

Read Also: Yadadri: నేను ఆత్మహత్య చేసుకుంటా ప్లీజ్‌ అనుమతివ్వండి.. కలెక్టర్‌కు మాజీ ఉద్యోగి లేఖ

600 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ టోకీజీ ఆలయం .. జపాన్‌ లో ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ కి ఘనమైన సంస్కృతి, ఆచార సంప్రదాయాలున్నాయి. ఈ దేవాలయం మహిళా సాధికారతని, నవీనీకరణ సందేశాన్ని అందిస్తుంది. అందువల్ల.. ఆ టెంపుల్‌ని.. విడాకుల ఆలయంగా పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా.. ఈ డివోర్స్ దేవాలయంగా ఎంతో పాపులర్ అయింది. అస్సలు ఈ ఆలయానికి ఆ పేరెలా వచ్చిందంటే.. 1285లో బౌద్ధ బిక్షువు కాకుసాన్‌ షిదో-నీ నిర్మించిన ఈ ఆలయం ప్రముఖ బౌద్ధ మందిరంగా విరాజిల్లుతుంది. మొదట్లో ఈ ఆలయంలో నిస్సహాయులైన మహిళలకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చేవారు.. ఆ రోజుల్లో మహిళల పరిస్థితి ఘోరంగా ఉండేది. మహిళలు గృహ హింసకు గురయ్యేవారు. దాంతో.. వాళ్లంతా ప్రశాంతత కోసం ఈ గుడికి వెళ్లేవారు.

Read Also: Cleaning Silk Sarees: ఇంట్లోనే పట్టుచీరల క్లీనింగ్‌కు 5 చిట్కాలు

ఆ రోజుల్లో.. జపాన్‌లోని కొన్ని సామాజిక వర్గాల్లో జరిగే పెళ్లిళ్లు.. పెటాకులవుతుండేవి. విడాకులు కూడా ఎక్కువగా జరిగేవి. ఇటువంటి సమయంలో.. ఒంటరి మహిళలంతా ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందేవారు. అలాంటి మహిళలకు.. ఈ టెంపుల్ లోనే.. విడాకుల పేపర్స్ ఇచ్చేవారు. అవి ఒంటరి మహిళలకు.. స్వేచ్ఛగా ఉండే హక్కును ఇచ్చేవి. ఈ టోకీజీ మందిరంలో ఓ సంగ్రహాలయం కూడా ఉంది. అప్పట్లో మహిళల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే ఆనవాళ్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయ్.

Read Also: Pragya Jaiswal : నాజుకు నడుమందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..

పేరుకు ఇది విడాకుల ఆలయంగా ప్రసిద్ధి చెందినా.. ఇదొక బౌద్ధ మందిరం. బౌద్ధ మతానికి సంబంధించిన ధార్మిక సమావేశాలు ఇ‍క్కడ జరుగుతుండేవి. ఇప్పటికీ.. ఈ ఆలయంలోని బౌద్ధ బిక్షువులు, నన్‌లు ఇక్కడికి వచ్చేవారికి మార్గదర్శనం చేస్తుంటారు. పచ్చని ప్రకృతి సోయగాల మధ్య ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. కలపతో రూపొందించిన అనేక కళాకృతులు ఈ ఆలయంలో మనకు కనిపిస్తాయి. ఆలయ ద్వారం నుంచి వెళ్లేవారికి రాతితో కూడిన రహదారి మార్గం స్వాగతం పలుకుతుంది. ఆలయంలోని పెద్ద హాలులో ధార్మిక సమావేశాలు, ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి.