NTV Telugu Site icon

Viral News: వాయమ్మా.. అక్కడ ఒక కండోమ్ ప్యాకెట్ రూ. 60 వేలు!

Condoms Most Expensive

Condoms Most Expensive

సాధారణంగా ఒక కండోమ్ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది? మన దేశంలో అయితే 30 రూపాయలకే లభ్యమవుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే స్వయంగా ప్రభుత్వాలే ఉచితంగా కండోమ్ ప్యాకెట్స్‌ని పంచి పెడుతున్నాయి. అవాంచిత గర్భధారణ నివారణకు, హెచ్‌ఐవీ లాంటి వ్యాధులు వాపించకుండా ఉండేందుకే కండోమ్స్ వాడాల్సిందిగా ప్రభుత్వాలు ప్రచారం చేస్తాయి. కానీ.. ఒక దేశంలో మాత్రం ఓ కండోమ్ ప్యాకెట్ ధర అక్షరాల రూ. 60 వేలు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇంతకీ ఏ దేశంలో అనుకుంటున్నారా? సౌత్ అమెరికాలోని వెనిజులాలో ఒక కండోమ్ ప్యాకెట్ అంత భారీ ధర పలుకుతోంది.

ఇందుకు కారణం.. వెనిజులాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే! ఈ సంక్షోభం కారణంగా ఆ దేశంలోని ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. ధరలన్నీ భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే కండోమ్ ప్యాకెట్ ధర ఏకంగా రూ. 60 వేలకు చేరింది. బ్రాండెడ్ టీవీలు ఇంత కంటే తక్కువ ధరకే అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ రేంజ్‌లో అక్కడ కండోమ్ ప్యాకెట్ల ధర పెరగడానికి మరో కారణం కూడా ఉంది. వెనిజులాలో అబార్షన్‌లు చట్ట విరుద్ధం. ఎవరైనా అబార్షన్‌లకు పాల్పడితే, అక్కడ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే, అవాంచిత గర్భధారణను నివారించేందుకు అక్కడ కండోమ్ ప్యాకెట్ల వాటకం గణనీయంగా పెరిగిపోయింది. అంటే, వాటికి అక్కడ భారీ డిమాండ్ పెరిగింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు.. డిమాండ్ పీక్స్‌లో ఉండటం వల్ల వాటి ధరల్ని అమాంతం పెంచారు.

2015 ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా టీనేజ్ గర్భిణీలున్న దేశాల్లో వెనిజులా ఒకటిగా నిలిచింది. పైగా, ఇక్కడ అబార్షన్‌పై నిషేధం ఉంది. అలాంటి దేశంలో ఒక కండోమ్ ప్యాకెట్‌పై రూ. 60 ధరలు కేటాయిస్తున్నప్పుడు, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎంత డిమాండ్, సంక్షోభం ఉంటే మాత్రం.. ధర మరీ అంత ఎక్కువగా పెంచేయాలా?