UK YouTuber: బ్రిటీష్.. భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. యూకే యూట్యూబర్ ఎందుకు ఇలా అన్నాడు?
- భారతీయ రైల్వేలో ప్రయాణించిన యూకే యూట్యూబర్
- మొదటిసారి రైలులో ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్
- సరైన సమయానికి ఫుడ్ డెలివరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ఫుడ్ డెలివరీలు కామన్‌గా మారాయి. రెస్టారెంట్ నుంచి ఇంటికే కాదు.. ఇప్పుడు రైల్లో ప్రయాణిస్తున్న వారికి సైతం ఫుడ్ డెలివరీ ఈజీగా చేసేస్తున్నారు. ఇది చాలా సాధారణ విషయంగా అనిపించవచ్చు. కానీ చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది సాధ్యం కాదు. ఈ విషయాన్ని భారతదేశంలోని చాలా మంది విదేశీయులకు ఒక కల భావిస్తారు. బ్రిటిష్ యూట్యూబర్ జార్జ్ బక్లీ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. వారణాసికి రైలు ప్రయాణంలో జార్జ్ మొదటిసారి రైలులో ఆన్లైన్ ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. కరెక్ట్ టైమ్‌కి ఫుడ్ డెలివరీ కావడంతో అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “యూకే భారతదేశం నుంచి ఈ విషయం నేర్చుకోవాలి.” అని యూట్యూబర్ అన్నాడు.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
బక్లీ వారణాసి వెళ్లేందుకు ఏసీ ఫస్ట్-క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు. తనకు ఆకలేసింది. తను ప్రయాణిస్తున్న ట్రైన్ నెక్ట్స్ స్టేషన్ కాన్ఫూర్. తను ప్రయాణిస్తున్న ట్రైన్ కాన్ఫూర్‌లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఆగుతుందని షెడ్యూల్ ఉంది. ఏదైతే అది అవుతుందని రెండు గంటల ముందే ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా శాండ్విచ్, మిల్క్‌షేక్ ఆర్డర్ చేశాడు. ట్రైన్ కాన్ఫూర్కి చేరుకుంది. తన ఆర్డర్ కోసం తాను ప్రయాణిస్తున్న బోగిలో వేయిట్ చేస్తున్నాడు. ఆ సమయంలోనే తన ఆర్డర్ సమయానికి పర్ఫెక్ట్గా డెలివరీ కావడం అతన్ని ఆశ్చర్యపరిచింది. తన సీటు వద్దకు డెలివరీ బాయ్ వచ్చి శాండ్విచ్ అందజేశాడు.
READ MORE: Tahawwur Rana: పాక్ ఆర్మీ అంటే ప్రేమ, ఐఎస్ఐతో పరిచయం.. విచారణలో సంచలన విషయాలు..
మనలో చాలా మందికి రైల్లో ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం మామూలే అయినా, అతనికి మాత్రం ఇదో నమ్మలేని అనుభవం. భారత్‌లో అంత టెక్నాలజీ ఉందా? అని జార్జ్ అవాక్కయ్యాడు. జార్జ్ ఆ మొత్తం సంఘటనను వీడియో తీశాడు. బక్లీ తన వీడియోలో ఈ మొత్తం ప్రాసెస్‌ను యాప్‌లో ఆర్డర్ చేయడం దగ్గర్నుంచి, తన సీటు వద్ద శాండ్విచ్ అందుకోవడం వరకు వివరంగా రికార్డ్ చేశాడు. వీడియోలో అతను చాలా ఎగ్జైట్మెంట్తో, ఆశ్చర్యంతో కనిపించాడు. “నేను ఇండియాలో ట్రైన్లో ఫుడ్ డెలివరీ తీసుకుంటున్నాను. నమ్మకపోతే, కాసేపు ఆగండి చూపిస్తా” అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. డెలివరీ బాయ్ అతనితో సెల్ఫీ దిగి వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ విషయంలో యూకే భారత్ నుంచి నేర్చుకోవాలని జార్జ్ అన్నాడు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!