NTV Telugu Site icon

పెళ్లిలో చిచ్చుపెట్టిన పూల‌దండ‌… చివ‌ర‌కు…

క‌రోనా కాలంలో పెళ్లిళ్లు చాలా సింపుల్‌గా జ‌రుగుతున్నాయి. పెద్ద హంగామా లేకుండా ఎలాంటి సంద‌డి లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి ఓ పెళ్లి పూల‌దండ కార‌ణంగా ఆగిపోయింది. వివాహం స‌మ‌యంలో వ‌ధూవ‌రులు దండ‌లు మార్చుకోవాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో వ‌రుడు దండ‌ను వ‌ధువు మెడ‌లో వెయ‌కుండా విసిరేసిన‌ట్టుగా వేశాడు. దీనిపై పెళ్లికూతురు అభ్యంత‌రం చెప్పింది. ఇరు వర్గాల‌కు చెందిన బంధువులు స‌ర్ధిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, వ‌ధువు త‌గ్గ‌లేదు.. దండ‌ను విసిరేయ‌డం న‌చ్చ‌లేద‌ని,త‌న‌కు ఆ పెళ్లి వ‌ద్ద‌ని భీష్మించుకు కూర్చున్న‌ది. ఇక వ‌రుడు కూడా తాను దండ‌ను విసిరేయ‌లేద‌ని బుకాయించాడు. దీంతో ఇరు వ‌ర్గాల‌కు చెందిన బంధువులు ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు చేసుకున్నారు. కొట్లాట‌కు దిగారు. వెంట‌నే పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి పెళ్లిపెద్ద‌ల‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రూ త‌గ్గ‌క‌పోగా పెళ్లిన క్యాన్సిల్ చేసుకొని వెళ్లిపోయారు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఔరైయ్య జిల్లాలోని న‌వీన్ బ‌స్తీలో జ‌రిగింది.

Read: భార‌త్‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు… పెరిగిన మ‌ర‌ణాలు…