NTV Telugu Site icon

China: పది రోజులు మంచులో చిక్కుకున్న యువకుడు.. ఆకలి బరించలేక టూత్ పేస్ట్ తిని..

China

China

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు ప్రజలను నవ్విస్తాయి. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి ఓ ఆశ్చర్య పరిచే ఘటన చైనాలో జరిగింది. వాయువ్య చైనాలోని మంచు పర్వతంపై 18 ఏళ్ల యువకుడు 10 రోజుల పాటు మంచులో చిక్కుకున్నాడు. ఆహారం లేక పోవడంతో విలవిల లాడాడు. 10 రోజుల తర్వాత రెస్క్యూ అండ్ రిలీఫ్ టీం ఆ యువకుడని గుర్తించింది. ఆ టీం అతని ప్రాణాలు కాపాడింది. ఈ పది రోజుల పాటు ఆహారం లేకపోవడంతో అతడు చాలా బలహీనంగా మారాడు. ఆహారం కొరతగా ఉన్నప్పటికీ నది నీళ్లు తాగుతూ.. ఆకలి తీర్చుకోవడానికి తన వద్ద ఉన్న టూత్‌పేస్ట్ సైతం తిన్నాడు.

READ MORE: IND vs NZ: ఇండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 18 ఏళ్ల సన్ లియాంగ్ పర్వాతారోహకుడు. ఫిబ్రవరి 8న షాంగ్జీ ప్రావిన్స్‌లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాలలో ఒకటైన క్విన్లింగ్ పర్వతాలను ఒంటరిగా అధిరోహించేందుకు వెళ్లాడు. ఈ పర్వతంపై అసాధారణ వాతావరణం ఉంది. ఈ పర్వతం అధిరోహించడం ఓ కఠినమైన చర్య. ఈ పర్వతంపై అనేక రకాల జంతువులు కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా.. లియాంగ్ తన అడుగులు ముందుకు వేశాడు. కానీ కేవలం రెండు రోజులకే తప్పిపోయాడు. దారి తప్పి, లియాంగ్ నది ఒడ్డున నడుస్తూనే ఉన్నాడు. పర్వతంపై నుంచి పడి కుడి చేయి విరిగి పోయింది. దీంతో అతను ఒక చోట ఆకుల సహాయంతో తాత్కాలిక మంచం ఏర్పాటు చేసుకున్నాడు. తీవ్రమైన చలితో ఇబ్బంది పడుతూ సహాయం కోసం ఎదురు చూశాడు.

READ MORE: MLC Kavitha : రెండో దఫా కులగణనలో లోపాలు – బీసీల హక్కులకు ముప్పు

కుటుంబంతో లియాంగ్ సంబంధాలు కట్ అవ్వడంతో అతన్ని సంప్రదించలేకపోయారు. ఈ సమాచారాన్ని స్థానిక రెస్క్యూ బృందాలకు తెలియజేస్తారు. రోజుల తరబడి కష్టపడి వెతికిన టీం సభ్యులు ఫిబ్రవరి 17న అతన్ని కనుగొన్నారు. రెస్క్యూ టీం ప్రకారం.. బాలుడు ప్రమాదకరమైన కొండను ఎక్కుతున్నాడు. గత 20 ఏళ్లలో ఈ మార్గంలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల దృష్ట్యా, స్థానిక పరిపాలన 2018 లో ఈ పర్వతాన్ని ఎక్కడం నిషేధించింది. కానీ.. కొంతమంది ధైర్యవంతులు రిస్క్ తీసుకుంటూనే ఉన్నారు. ఈ ప్రమాదకరమైన ప్రాంతంలో తప్పిపోయి నిర్జీవంగా దొరికి వ్యక్తి లియాంగ్ మాత్రమే.