పెళ్ళిలో కట్నం ఇవ్వడం ఆనవాయితీ. ఒకప్పుడు కన్యాశుల్కం అమలులో ఉండేది. కానీ, ఇప్పుడు కన్యాశుల్కం కాస్త వరకట్నంగా మారింది. అయితే, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికి కన్యాశుల్కం అమలులో ఉన్నది. దానినే ఆ ప్రాంతంలో మోహోర్ అని పిలుస్తారు. బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో కళ్యాణి విశ్వవిద్యాలయంలో చదువుతున్న మొయినా ఖాటూన్ అనే మహిళ ఇటీవలే వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. తనకు వరుడి తరపున ఇచ్చే కట్నం వద్దని దాని స్థానంలో పుస్తకాలు ఇవ్వాలని కోరింది. మొదట వరుడి కుటుంబం షాక్ అయినా, వధువు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి ఆమెకు పుస్తకాలను బహుమతిగా అందించారు. ఈ న్యూస్, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.