Site icon NTV Telugu

Super : బెలూన్స్‌ సెల్స్‌ గర్ల్‌ టూ మోడల్‌.. తన జీవితాన్ని మార్చి ఫోటో..

Balloons sales girl turned model in over night

కొన్ని కొన్ని సార్లు జీవితం ఏవిధంగా మలుపు తిరుగుతుందో తెలియదు. తినడానికి తిండిలేకపోయినా.. ఒక్కరోజులోనే అదృష్టం వరించి స్టార్లుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. ఇటీవల మమ్మికా అనే ఓ దినసరి కూలీని ఓ ఫోటో గ్రాఫర్‌ గుర్తించి.. ఆయనకు సూటు బూటు వేసి ఫోటోలో తీయడంతో ఒక్క రాత్రిలోనే మోడల్‌గా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఓ యువతి తలరాతను ఓ ఫోటో గ్రాఫర్‌ బుర్రలో మెదిలిన ఆలోచన మార్చింది. జనవరి 17న కేరళలోని అందలూరుకావులో జరిగిన ఓ జాతరకు ఫోటో గ్రాఫర్‌ అర్జున్‌ కృష్ణన్‌ వెళ్లాడు. అయితే అక్కడ కిస్బూ అనే యువతి బెలూన్లు అమ్ముతూ కనిపించింది. దీంతో అర్జున్‌ కృష్ణన్‌ బుర్రలో ఓ ఆలోచన వచ్చి ఓ ఫోటో తీశాడు.

ఆ ఫోటో తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో అర్జున్‌ కృష్ణన్‌ కిస్బూ ఇంటి వెళ్లి ఆ యువతి వాళ్లమ్మకు ఆ ఫోటో చూపించాడు. ఆ ఫోటోలు చూసిన కిస్బూ అమ్మసైతం ఆనందం వ్యక్తం చేసింది. అయితే అర్జున్‌ కృష్ణన్‌ కిస్బూ వాళ్ల అమ్మను తనను ఒప్పించి ఫోటో షూట్‌ చేశారు. ఈ సారి మేకప్‌ వేయించి ఓ మోడల్‌ ఫోటో షూట్‌ మాదిరిగా చిత్రీకరించి నెట్టింట్లోకి వదిలాడు. ఇంకేముంది.. బెలూన్స్‌ సెల్స్‌ గర్ల్‌ కాస్త మోడల్‌గా మారిపోయింది. ఆమె ఫోటో చూసిన కొన్ని కంపెనీలు మోడల్‌గా తీసుకుంటామని ముందుకురావడం విశేషం.

Exit mobile version