NTV Telugu Site icon

Jordan Restaurant: అబ్బో ఆ రెస్టారెంట్ లో తిన్నాక.. కాసేపు హాయిగా పడుకోవచ్చు..

Marfa Rest

Marfa Rest

జోర్డాన్‌లోని ఒక రెస్టారెంట్‌లో తిన్న తర్వాత హాయిగా నిద్రపోవడానికి సౌకర్యాన్ని కల్పిస్తూ చక్కగా ఏసీ గదులను ఏర్పాటు చేశారు. ఆ హోటల్లో అక్కడి ఫేమస్ డిష్ తిన్నవారు కచ్చితంగా పడుకుని తీరాలని ఆ రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది. అయితే, కడుపునిండా తిన్నాక ఎవ్వరికైనా కాసేపు పడుకోవడం కామన్. తిన్న తర్వాత కొద్దిసేపు కునుకు తీస్తే మనసుకి, శరీరానికి చాలా రిలీఫ్ దొరుకుతుంది. ఇంట్లో అయితే తిన్న తర్వాత పడుకున్నా పర్వాలేదు కానీ.. రెస్టారెంట్‌లో తిన్న తర్వాత నిద్రపోవడం కుదరదు అనే విషయం అందరికి తెలుసు.

Read Also: Uttar Pradesh: ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడు.. గొడ్డలితో నరికి చంపిన కొడుకు

అయితే, జోర్డాన్‌ రాజధాని అమ్మాన్ లోని ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత హాయిగా పడుకోవచ్చు. అందుకోసం అక్కడ ఏసీ రూమ్స్ ను కూడా ఆ రెస్టారెంట్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఇక, ఆ రెస్టారెంట్ ఫేమస్ డిష్, జోర్దాన్ జాతీయ వంటకమైన మన్సాఫ్ తిన్నవారికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. పులిసిన పెరుగుతో, స్వచ్ఛమైన నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేసే మన్సాఫ్ తిన్న తర్వాత ఎవరికైనా నిద్ర తన్నుకొస్తుందట.. అలా రాకపోతే ఆ మన్సాఫ్ లో ఎదో లోపముండే ఛాన్స్ ఉంటుందని ఆ రెస్టారెంట్ కు వచ్చే అతిథులు అంటారు.

Read Also: IPhone 15 Pro: ఐఫోన్ 15 సిరీస్ ఫీచర్స్ అదుర్స్.. Wi-Fi 6E టెక్నాలజీ ప్రో మోడల్స్

ఇక ఆ హోటల్ సహ యజమాని ఒమర్ బైడీన్ మాట్లాడుతూ.. మన్సాఫ్ కోసం వాడే పదార్ధాలను తిన్న తర్వాత నిద్ర రావడం కామన్.. మొదట్లో దీన్ని జోక్ గా తీసుకున్నాము.. కానీ ఈరోజు అదే ఈ హోటల్ ప్రత్యేకత అయింది. అందుకే నిద్రపోవడానికి సౌకర్యం కల్పించాలని ప్రత్యేకంగా ఏసీ రూమ్స్ ఏర్పాట్లు చేశామన్నారు. అయితే, ఈ హోటల్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జోర్డాన్‌ వెళ్ళినప్పుడు కచ్చితంగా ఈ హోటల్‌కి వెళ్లి తీరతామని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఇలాంటి హోటల్ దగ్గర ఒకటి పెడితే బాగుంటుందని అంటున్నారు.