NTV Telugu Site icon

Viral Video : ఇదేందీ తల్లి.. ఆఖరికి మెట్రోను కూడా వదలరా.. దేవుడా..

Metro News

Metro News

ట్రాఫిక్ అంతరాయం లేకుండా చాలా సులభంగా అనుకున్న గమ్యస్తానానికి త్వరగా చేర్చే వాటిలో మెట్రో మొదటి స్థానంలో ఉంది.. ఈ సమ్మర్ కు ఎక్కువ మంది మెట్రోను వాడుతున్నారు.. అయితే మెట్రోను ప్రయాణానికి మాత్రమే కాదు సోషల్ మీడియాలో క్రేజ్ ను కూడా సంపాదించుకోవడానికి వాడుతున్నారు.. మెట్రోలో డ్యాన్స్ కు వేస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదిస్తున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. మెట్రోలో ఓ అమ్మాయి.. ఎంచక్కా జుట్టుకు స్ట్రైట్నర్ ను పెట్టుకొని మెట్రోలోనే రెడీ అయ్యింది.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..

ఈ మధ్య కాలంలో మెట్రో ట్రైన్‌లో యువతీ, యువకుల అసభ్య ప్రవర్తనకు సంబంధించి బాగా వస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రీల్స్ చేయడం వంటివి కూడా చూస్తున్నాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం మాత్రం అంతకు మించి అని చెప్పాల్సిందే. సాధారణంగా అమ్మాయిలు, మహిళలు తమ అందంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఇక జుట్టు అందం విషయంలో నిత్యం అలర్ట్‌గా ఉంటారు. ఇంట్లోనే కాదు.. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మేకప్‌ బాక్స్ ఓపెన్ చేసేస్తారు. తాజాగా ఓ అమ్మాయి మెట్రో ట్రైన్‌లో అదే పని చేసింది. టైమ్ లేకనో, మరే కారణమో గానీ.. ఆ అమ్మాయి హెయిర్ స్ట్రెయిటెనర్‌ను యూజ్ చేసి తన జుట్టును సరి చేసుకుంది. మెట్రో ట్రైన్‌లో ఉండే ఛార్జింగ్ కేస్‌కు హెయిర్ స్ట్రెయిటెనర్‌ ప్లగ్ ఇన్‌సర్ట్ చేసింది.

పిచ్చి పిచ్చిగా ఉన్న తన జుట్టును వెంటనే సవరించుకుంది..యువతి అలా చేసుకుంటుండగా తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ఓ యూజర్ పోస్ట్ చేశారు. ‘ఢిల్లీ మెట్రో చాలా ప్రత్యేకమైనది’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఎందుకంటే.. దేశంలో ఏ మెట్రో ట్రైన్‌లో చోటు చేసుకోని ఘటనలు, పరిణామాలు అన్నీ ఢిల్లీ మెట్రోలోనే కనిపిస్తాయి. అయితే, ఈ వీడియోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.. అధికారులు ఇలాంటి ఎందుకు పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.. ఆ వీడియో పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..