Site icon NTV Telugu

Viral Video: ఏంటి తల్లి నీకు భయమేస్తాలేదా.. పైథాన్ను అలా పట్టుకున్నావేంటి..

Viral Video

Viral Video

పైథాన్ అంటే అందరికీ భయమే.. దాన్ని చూడగానే కిందనుండి కారిపోతుంది. అది కాటు వేయకున్నా గానీ, చాలా ప్రమాదకరం. లైవ్లో గానీ, మ్యూజియంలో గానీ పైథాన్ను చూసినప్పుడు ఒళ్లు గగుర్పొడిస్తుంది. కానీ.. ఒక మహిళ మాత్రం తన చేతులతో భారీ కొండచిలువను ఎలా పట్టుకుందో చూస్తే షాకైపోతారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏ మాత్రం భయం లేకుండా కొండచిలువను పట్టుకుంది.

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం “ఎంఎస్‌పీ” చట్టం..

పొలంలో పడుకుని ఉన్న భారీ కొండచిలువను ఓ మహిళ వచ్చి తన చేతులతో నిర్భయంగా పట్టుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. కొండచిలువ మాత్రం మహిళ చేతుల్లో నుంచి బయటపడాలని చూసినప్పటికీ.. అస్సలు విడవడం లేదు. ఒక్కసారి హఠాత్తుగా కొండచిలువ ఆమే చేతుల్లోంచి జారిపోతుంది. వెంటనే దాని మెడను పట్టుకుంటుంది. కొండచిలువ మాత్రం చాలా కోపంతో ఆమేపై దాడికి దిగుతుంది. మహిళ చేతులను చుట్టేసి అటు ఇటు కదులుతూ ఉంటుంది. కానీ ఆ మహిళ మాత్రం గట్టిగా పిడికిలితో పట్టుకుని వదలడం లేదు. ఈ సన్నివేశాన్ని చూస్తుంటే మనకే ఎంతో భయమేస్తుంది.. కానీ ఆ మహిళకు ఏమాత్రం భయం, బెరుకు లేనట్లుంది.

Valentine Day Scams: ప్రేమికులకు అలర్ట్‌.. ఆన్‌లైన్ బహుమతుల విషయంలో తస్మాత్ జాగ్రత్త!

ఈ వీడియోను మైక్ హోల్‌స్టన్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు 3 లక్షల వ్యూస్, 40 వేల లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా.. చాలామంది రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఆ మహిళ అలుపెరగని ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు.. ఈ వీడియో చూసిన తర్వాత నాకు గూస్‌బంప్‌లు వచ్చాయి. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు.. ఆ ప్లేసులో నేనుండి ఉంటే, నా ఆత్మ ఈపాటికి శరీరాన్ని విడిచిపెట్టి ఉండేది. మరో వినియోగదారు.. ఓ దేవుడా, ఈ స్త్రీ తన చేతులతో అంత ప్రమాదకరమైన కొండచిలువను ఎలా పట్టుకుంది అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version