NTV Telugu Site icon

Viral Video: విమానాశ్రయంలోని రన్‌వేపైనే పాము-ముంగిసల యుద్ధం..వీడియో వైరల్

Viral Video

Viral Video

పాము, ముంగిసల మధ్య గొడవ జరిగినప్పుడల్లా అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కువ మంది వీటి మధ్య యుద్ధాన్ని చూసేందుకు ఇష్టపడతారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాము – ముంగిసల మధ్య బీకర పోరు..పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో వెలుగు చూసింది.

READ MORE: Priyanka Gandhi: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించిన ప్రియాంక గాంధీ..

విమానాశ్రయంలోని రన్‌వేపైనే ఈ ఆసక్తికర పోరు జరుగుతున్నట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. పాము ముంగిసపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ముంగిస తన చురుకుదనంతో ప్రతి దాడిని విఫలం చేస్తుంది. ఇంతలో తన భాగ్వామికి మద్దతుగా.. మరో రెండు ముంగిసలు చేరుతాయి. దీంతో విమానాశ్రయంలోని రన్ వే యుద్ధ భూమిగా మారుతుంది. మూడు కలిసి పాముపై విరుచుకుపడటం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేయగా.. చాలా మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

READ MORE:Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది. విమానాశ్రయ భద్రతపై కొందరు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. మరికొందరు ముంగిస సాహసాన్ని కొనియాడుతున్నారు. ఈసారి ముంగిస తన స్నేహితులను కూడా వెంట తెచ్చుకుందని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు గెలిచారన్నది వీడియోలో లేదు. ఎందుకంటే వీడియో చివరి వరకు రికార్డ్ చేయలేదు.

Show comments