Viral Video: ఈ రోజుల్లో, చాలా మందికి బాయ్‌ఫ్రెండ్ ఉండటం సర్వ సాధారణం అయిపోయింది. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని భావిస్తారు. పెళ్లికి ముందు ఎలాంటి బంధాలు ఏర్పడకూడదని వారు కోరుకుంటారు. ఎందుకంటే సమాజంలో పరిస్థితుల గురించి ఆలోచించి ఆలా డిసైడ్ అయ్యారు తల్లిదండ్రులు అందులో తప్పులేదు. కానీ.. పొరపాటున ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలిస్తే.. ఆ తల్లిదండ్రులు ఈ వీడియోలో చూపించిన తల్లిలా రియాక్ట్ అవుతారు. తన కూతురికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి ఓ తల్లి తట్టుకోలేకపోయింది. కూతురు రెండు చెంపలు వాయించింది. ఇదంతా ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
అలా కొట్టడం సరైన పద్దతి కాదు..
ఏంటి బాయ్‌ఫ్రెండ్ ఉంటే ఇలా కొడతారా? ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ రోజుల్లో బాయ్‌ఫ్రెండ్ ఉండటం మామూలే అని అంటున్నారు. తల్లిదండ్రులది దారుణమని కొందరు వ్యాఖ్యానించగా, పోలీసు కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని మరికొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఇది పిల్లల దుర్వినియోగం కిందకు వస్తుందని తీర్పు చెప్పారు. ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత పిల్లలు ప్రేమలో పడటం సాధారణమని భారతీయ తల్లిదండ్రులు ఎప్పటికీ గుర్తించరని అంటున్నారు. ఇలా జరుగుతాయనే ఉద్దేశ్యంతో అమ్మాయిలు ఇంట్లో వారితో ఫ్రీగా ఉండరని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. ఇలా స్పందించడం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతుందని అంటున్నారు.
Read also: Etela Rajender: మీడియా ముందుకు ఈటల దంపతులు..! సంగతి ఏంటి?
మందలించడంలో తప్పేముందు.. అది తల్లిప్రేమ..
బాయ్ ఫ్రెండ్ ఉండటం సహజమే కానీ.. మందలించిన తల్లి ప్రేమ కూడా సహజమే.. అందులో తప్పేముంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు పెడదారిన పడుతుందనే ఆవేదనతో కొట్టింది అని అనుకోవచ్చుగా అంటూ మరొ కొందురు కమెంట్ చేస్తున్నారు. అమ్మ ప్రేమను ఆవేశాన్ని ఎవరు ఊహించలేరంటూ మరికొందరు కమెంట్లు చేస్తున్నారు. ఆ తల్లి అలా చేయడంలో తప్పేముంది అంటున్నారు. కన్న బిడ్డకు ఏమైనా జరిగితే కంట తడిపెట్టాల్సింది మొదట తల్లి దండ్రులే అలా కాకుండా ఆతల్లి తన కూతురికి మందలించింది అని ఎందుకు అనుకోకూడదు. అందులో ఆతల్లిపై కేసు ఎందుకు పెడతారు? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈరోజుల్లో జరుగుతున్న అనర్థాలను బట్టే ఆతల్లి మందలించింది అంటున్నారు.
Kalesh b/w A Girl and a Family after they find out she have boyfriend pic.twitter.com/n4UdZSAZl0
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 25, 2023