మెట్రో రైళ్లు అంటేనే నిత్యం నగరవాసులతో రద్దీగా ఉంటాయి. ఇక ఆ మెట్రో రైళ్లలో కొందరు ప్రవర్తించే తీరు ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు మరిచిపోకముందే.. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక.. ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడా చేయని రీల్స్.. ఇక్కడ మాత్రం చేస్తూ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే.. తాజాగా ఒక యువతి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఆ యువతి వేసే డ్యాన్స్ స్టెప్పులు చూసి జనాలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.
Ambati Rambabu: పల్నాడు జిల్లా పోలీసులపై సిట్ కు ఫిర్యాదు చేశాం
ఈ వీడియోలో భోజ్‌పురి పాటకు అమ్మాయి డ్యాన్స్ చేసింది. ఆ అమ్మాయికి సంబంధించిన మూడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెట్రోలో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు పబ్ ల్లో వేసే డ్యాన్స్ మాదిరిలా చేసింది. అది చూసిన ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటీ మాకి ఖర్మ అంటూ ఫైరవుతున్నారు. యువతి డ్యాన్స్ చేసే ప్రదేశం మహిళల కోచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. అక్కడ అందరూ ఆడవాళ్లే కనిపిస్తున్నారు. కాగా.. మెట్రోలో ఇలాంటి డ్యాన్స్ లపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)కి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Indian 2: స్టార్ స్పోర్ట్స్‌లో ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్…ఆడియో లాంచ్ ఆరోజే
అంతకుముందు హోలీ రోజున ఇద్దరు అమ్మాయిలు చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఒకరికొకరు అసభ్యకరంగా రంగులు పూసుకున్నారు. ఈ వీడియో చాలా రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఇద్దరు అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని డిఎంఆర్‌సి ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. ఆ తర్వాత అతడిని వారిని అరెస్టు చేశారు. పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి వీడియోలు చేయకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.
दिल्ली मेट्रो में लड़की ने किया अश्लील डांस, वीडियो हुआ वायरल#DelhiMetro #delhi #Dance
क्लिक कर पढ़ें खबर…https://t.co/Q2H77tHgQX pic.twitter.com/Hnkcrk4me8— Gautam Geetarjun (गीतार्जुन) (@GautamGeetarjun) May 19, 2024
