Site icon NTV Telugu

Sand Lover: వింత అలవాటు.. 40 ఏళ్లుగా ప్రతిరోజూ ఇసుక తింటున్నాడు..!!

Eating Sand

Eating Sand

ఒక్కొక్కరికి ఒక్కో వింత అలవాటు ఉంటుంది. కొందరు కొన్ని పదార్ధాలను ఇష్టంగా తింటుంటారు. చిన్నపిల్లలు బలపాలు తింటారు. పెద్దవాళ్లు జంక్ ఫుడ్‌ తింటారు. అయితే ఒడిశాలోని ఓ వ్యక్తి మాత్రం ఇసుక తింటున్నాడు. అతడి పేరు హరిలాల్ సక్సేనా. వయసు 68 ఏళ్లు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అతడు వలసకూలీగా పనిచేస్తుంటాడు. ఉపాధి కోసం పదేళ్ల కిందట ఒడిశాకు వలస వెళ్లిపోయాడు. గంజాం జిల్లాలోని కిర్తిపూర్‌ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు.

Srilanka Crisis: దయచేసి అప్పు ఇవ్వండి.. ఇండియాను కోరిన శ్రీలంక

అయితే హరిలాల్ సక్సేనా గత 40 ఏళ్లుగా రోజూ ఒక పిడికెడు ఇసుక తింటున్నాడు. చిన్నప్పటినుంచే ఇసుక తినడం అలవాటుగా మారింది. దీంతో ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత లేదా భోజనానికి ముందు తనకు ఇసుక తినడం అలవాటుగా మారిందని హరిలాల్‌ చెప్తున్నాడు. ఇతరులు భోజనం తిన్న తర్వాత ఎంత హ్యాపీగా ఫీలవుతారో తాను ఇసుక తిన్న తర్వాత అంతే అనుభూతికి లోనవుతానని వివరిస్తున్నాడు. ఇసుక తిన్న తర్వాత కొంచెం అసౌకర్యంగా ఉంటుంది కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోలేదని పేర్కొన్నాడు. తమ గ్రామానికి దగ్గర్లోనే నది ఉండడం వల్ల రోజూ ఆ నది ఒడ్డుకు వెళ్లి ఇసుక తినేవాడినని.. వర్షాకాలం వస్తే ముందుగానే ఇసుక బస్తాలను సేకరించి ఇంట్లో నిల్వ ఉంచుకునేవాడినని హరిలాల్ పేర్కొన్నాడు.

 

Exit mobile version