NTV Telugu Site icon

Fake IPS: రూ. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేసిన యువకుడు.. డ్యూటీ చేస్తుండగా..

Fack Ips

Fack Ips

ఉద్యోగం పేరుతో మోసం చేసిన పెద్ద ఉదంతం బీహార్‌లోని జాముయ్‌లో వెలుగు చూసింది. ఇక్కడ మోసగాళ్ళు రూ. రెండు లక్షలు తీసుకొని ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. నకిలీ ట్రైనీ ఐపీఎస్‌ని జాముయి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌ చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. ఇప్పుడు ఇంత పెద్ద మోసం వెనుక ఏ ముఠా ఉందో తెలుసుకోవడానికి పోలీసులు ఈ మొత్తం కేసును దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల నుంచి పోలీసులు రాసి ఉన్న పల్సర్ బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

READ MORE:PM Modi US Visit : యూఎస్‌లో ప్రధానికి ఘన స్వాగతం.. కాసేపట్లో ‘మోడీ అండ్ అమెరికా’

రెండు లక్షలకు పోలీసు ఉద్యోగం..

అరెస్టయిన నకిలీ ఐపీఎస్‌ని విచారించగా.. రెండు లక్షలు ఈ జాబ్ ఇచ్చారని.. యూనిఫారంతో పాటు పిస్టల్ కూడా వచ్చిందని పోలీసులకు తెలిపాడు. ఇప్పుడు తాను ఐపీఎస్ అయ్యానని చెప్పాడు. వాస్తవానికి, జముయి జిల్లా సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో యూనిఫాంలో బైక్ పై తిరిగేస్తున్న మిథిలేష్ మాంఝీ యువకుడ్ని బీహార్ లోని జాముయ్ పోలీసులు పట్టుకున్నారు. చిన్న పిల్లలప్పుడు పోలీస్ యూనిఫాం కొనుక్కుంటే సరదాగా ఉంటుంది కానీ.. ఈ వయసులో పోలీస్ డ్రెస్ కొనుక్కుని వేసుకుంటే మోసం కిందకేసు పెడతారని సున్నితంగా హెచ్చరించారు. అత్యంత అమాయకంగా కనిపిస్తున్న ఆ యువకుడు తానే ఐపీఎస్ ఆఫీసర్నని ఎదురుదాడికి దిగాడు.

READ MORE: Devara Pre Release Event Cancelled: షాకింగ్ : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

కేసేనని ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు యువకుడ్ని విచారించడం మొదలు పెట్టారు. యువకుడి కథనం ప్రకారం.. ఐపీఎస్ ఆఫీసర్ పోస్టును రూ. రెండు లక్షలకు కొనుక్కున్ననని చెప్పాడు. ఇటీవల ఓ జలపాతం వద్దకు టూర్ కు వెళ్లినప్పుడు అక్కడ ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించాడు. తక్కువ ధరకే ఐఏఎస్ ని చేస్తానని చెప్పాగానే యువకుడు ఎగిరి గంతేశాడు. తనకు అందరూ తెలుసని .. ఇట్టే ఉద్యోగం ఇప్పిస్తానని మోసగాడు యువకుడిని నమ్మబలికాడు. ఫోన్లు మాట్లాడినట్లుగా నటించిన మోసగాడు.. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగం వస్తుందని.. రెండున్నర రోజుల్లోనే తెచ్చివ్వాలన్నాడు. ఆ యువకుడు బంధువుల్ని వేధించి .. రెండు లక్షలు అప్పు తీసుకొచ్చి మోసగాడికి ఇచ్చాడు. అనంతరం మోసగాడు.. యూనిఫాంతోపాటు నకిలీ పిస్టల్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. యువకుడు ఖైరా పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంటికి వెళ్తున్నట్లు సమీప గ్రామస్థులు, ప్రత్యక్ష సభ్యుల నుంచి సమాచారం అందిందని సికంద్రా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.