Viral News: అతనికి 61.. ఆమెకి 18.. ఆయనే బెస్ట్ అంటూ కితాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ గుడ్డిదని అంటుంటారు. ప్రేమకు వయసు, ఆస్తులు, కులమతాలతో సంబంధం ఉండదని చెప్తుంటారు. కానీ, ఓ అమ్మాయి చేసిన పనికి మాత్రం ప్రేమ మూగది, చెవిటిది అని కూడా అనాల్సి వస్తోంది. కారణం.. ఆమె ఏకంగా తాత వయసున్న వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకోవడమే! అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. 18 ఏళ్ల ఓ అమ్మాయి.. 61 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఇంకా ప్రేమలో పడకుండా సింగిల్‌గానే మిగిలున్న అబ్బాయిల గుండెల్ని పిండేసే ఈ ప్రేమ వ్యవహారం పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.
ఆ అమ్మాయి పేరు ఆషియా.. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు రానా శంషాద్. చాలా పేదరికంలో ఉన్నప్పటికీ, ఎలాంటి లోటు లేకుండా కూతుళ్ల పెళ్లి చేశాడు. పైగా, చాలా మంచివాడని రానా శంషాద్‌కి పేరుంది. ఈ విషయాలు వినే తనకు ఆయనపై ఆసక్తి కలిగిందని, రెండుసార్లు కలిసి తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆషియా తెలిపింది. పెళ్లి తర్వాత శంషాద్ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని, ఏది కావాలని కోరినా వెంటనే తెచ్చిస్తారని ఆషియా చెప్పింది. జంటల్ని దేవుడు నిర్ణయిస్తాడని, హృదయాలు మాత్రమే ఇక్కడ కలుస్తాయని హితవు పలుకుతోంది.
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
అయితే.. తమ వయస్సు వ్యత్యాసం కారణంగా ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని శంషాద్ చెప్పారు. అంతెందుకు.. ఆషియాతో పెళ్లికి ఓకే చెప్పినప్పుడు తన బంధువులు నోటికి వచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాత్రం వాటిని పట్టించుకోలేదని, వయసు తేడా దృష్ట్యా ఇలాంటి అడ్డంకులు రావడం సాధారణమేనని అనుకున్నానన్నారు. ఇప్పటికీ తమ పెళ్లి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయన్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. అసలు తమ పెళ్లి ఎప్పుడు జరిగిందనేది శంషాద్, ఆషియాలు క్లారిటీ ఇవ్వలేదు.
తాజావార్తలు
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!