ప్రస్తుతం కాలంలో ఎక్కువ రోజులు బతకడం కష్టం. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది 60-70 మధ్యలోనే మరణిస్తున్నారు. మరి కొందరు రోగాలు, ప్రమాదాలు సంభవించి మధ్యలోనే మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా వృద్ధ తల్లి, కుమార్తెల అసమాన ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసి అందరూ భావోద్వేగానికి గురవుతున్నారు. కొన్ని సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ చాలా మంది హృదయాలను తాకుతోంది. ఈ వైరల్ వీడియోలో.. 107 ఏళ్ల వృద్ధురాలు తన జేబులోంచి ప్రేమగా చాక్లెట్ తీసి తన 84 ఏళ్ల కూతురికి ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వందేళ్లు దాటిన తల్లి, ఎనిమిది పదుల వయసు దాటిన కుమార్తెకు చెందిన వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్య పడుతున్నారు.
READ MORE: Karnataka: హౌసింగ్ పథకంలో ముస్లింలకు 15 శాతం కోటా.. కాంగ్రెస్ సర్కార్ ఆమోదం..
తల్లి ఇచ్చిన చాక్లెట్ అందుకున్న ఆ వృద్ధ కూతురు ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. నెటిజన్లు ఈ దృశ్యాన్ని చాలా ఇష్టపడుతున్నారు. మరికొందరు దీనిని చూసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. వాస్తవానికి.. ఈ వీడియో ఆరు సంవత్సరాల నాటిది, కానీ ఇంటర్నెట్‌లో మళ్లీ షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ హృదయ విదారక వీడియోను @interestingside అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. 107 ఏళ్ల చైనా మహిళ తన జేబులోంచి మిఠాయి ముక్కను తీసి ప్రేమగా తన 84 ఏళ్ల కుమార్తెకు ఇచ్చే హృదయ విదారక క్షణం అని యూజర్ క్యాప్షన్‌లో రాశారు. వీడియో ప్రకారం.. వీరు చైనాకి చెందిన వారిగా పేర్కొన్నారు. ఈ వార్త రాసే సమయానికి, 13 లక్షలకు పైగా ప్రజలు ఈ పోస్ట్‌ను లైక్ చేశారు. అయితే ఈ వీడియోను కోట్లాది మంది వీక్షించారు. దీర్ఘాయుస్సు, కుటుంబ సంబంధాన్ని హైలైట్ చేస్తున్నారు.
READ MORE: Solo Boy : అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా ట్రైలర్ లాంచ్
