భూమిపై ఎన్నో రకాల జీవులు జీవిస్తుంటాయి. అందులో కొన్ని జీవులు వాటి కంటే చిన్న చిన్న జీవులను చంపి వాటి ఆకలిని తీర్చుకుంటాయి. అయితే అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో.. ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ పాము.. ఓ కీటకాన్ని చంపి తినాలని ప్రయత్నించింది. అయితే.. కీటకం మాత్రం నువ్వు నేనా అన్నట్లు పామును ముప్పు తిప్పలు పెట్టింది. దీంతో ఆ పాము మెల్లగా అక్కడి నుంచి జారుకుంది.
Read Also: Locals Attack : గాయపడిన వారికి.. సహాయం చేసిన వ్యక్తిపై దాడి చేసిన కుటుంబ సభ్యులు
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఓ కీటకం, పాముకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. పాము ఎలాగైనా ఆ కీటకాన్ని చంపి తినాలన్న కసితో దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కీటకం మాత్రం ఎదైతే అదైంది.. తగ్గేదే లే అంటూ.. ఆ పాముతో పోరాడింది. పాము దానిని కాటు వేయడానికి నోరు తెరిచిన వెంటనే… ఆ కీటకం తిరిగి పామునే కాటేసింది. దీంతో పాము నొప్పితో మెలికలు తిరుగుతుంది. పాము కీటకాన్ని కాటు వేయలేకపోయింది. చివరుకు చేసేదేమీ లేక ఆ పాము అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఈ భారీ కీటకం బహుశా స్కోలోపేంద్ర హీరోస్ అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది విషపూరితమైనది. దాని న్యూరోటాక్సిక్ విషంతో విషపూరిత పాములను కూడా ఓడించగలదు.
అయితే.. 29 సెకన్ల ఈ వీడియోను 55,000 సార్లు వీక్షించారు. వందలాది మంది దీనిని లైక్ చేసి వివిధ స్పందనలను తెలియజేస్తున్నారు. వీడియో చూస్తూ, వినియోగదారులు, “ఇది ఎలాంటి సెంటిపెడ్? ఒక కీటకం పాముతో పోరాడిందంటే నమ్మడం కష్టం” అని పేర్కొన్నారు. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం ఈ వీడియోను చూస్తే.. ఎవరిని.. ఎప్పుడు.. ఎక్కడా తక్కువ అంచనా వేయకూడదంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
— Wildlife Uncensored (@TheeDarkCircle) November 3, 2025