NTV Telugu Site icon

Satya Nadella, GMR: సత్య నాదెళ్ల కొత్త ఇన్నింగ్స్‌. జీఎంఆర్‌తోపాటు మరింత మంది

Satya Nadella, GMR

Satya Nadella, GMR

Satya Nadella, GMR: మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్యనాదెళ్ల.. క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అమెరికాలో కొత్తగా ప్రారంభమవుతున్న టీ20 టోర్నీలో పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌గా పేర్కొనే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ఒక టీమ్‌ని సత్యనాదెళ్ల ఫైనాన్షియల్‌గా ప్రమోట్‌ చేయనున్నారు. ఆ జట్టు పేరు.. సియాటల్‌ ఆర్కాస్‌.

దీనికి సంబంధించిన ఫ్రాంచైజీ నిర్వహణ కోసం ఆయన పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రికెట్‌ లీగ్‌ జులైలో లాంఛ్‌ కాబోతోంది. సియాటల్‌ గ్రూప్‌లో సత్యనాదెళ్లతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్‌ మరియు జీఎంఆర్‌ గ్రూప్‌ సహా పలువురు ప్రముఖులు కూడా పార్ట్నర్‌లు అవుతున్నారు. ఈ మేరకు.. మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ ఒక ప్రకటన చేసింది. ఆర్కాస్‌ అనేది సియాటల్‌ ఏరియాలోని సముద్రంలో సంచరించే ప్రమాదకరమైన తిమింగళం పేరు.

Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?

ప్రాణాంతకమైన ఈ జీవిని.. శక్తికి మరియు బలానికి చిహ్నంగా భావిస్తారు. సియాటల్‌ ఆర్కాస్‌ జట్టులో సత్యనాదెళ్లతోపాటు సోమ సోమసేగర్‌, సమీర్‌ బోడాస్‌, అశోక్‌ కృష్ణమూర్తి, సంజయ్‌ పార్థసారధి వంటివాళ్లు సైతం ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ జులై 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెక్సాస్‌లోని డల్లాస్‌లో జరుగుతుంది.

ఒక్కో టీమ్‌లో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్లు ఉంటారు. ఇందులో 9 మంది విదేశీ ఆటగాళ్లు కాగా మ్యాచ్‌లో పాల్గొనే 11 మందిలో మినిమం ఆరుగురు లోకల్‌ ఆటగాళ్లు ఉంటారు. ఇదిలాఉండగా.. ఇండియన్‌ క్రికెట్‌లో మెగా సక్సెస్‌ అయిన ఐపీఎల్‌ ప్రయోగం ఇప్పుడు అమెరికాకి కూడా పాకిందని దీన్నిబట్టి చెప్పొచ్చని పరిశీలకులు అంటున్నారు.