NTV Telugu Site icon

Record Level Cars Sales: కొత్తల్లుడికి అత్తింటివారి కానుక

Record Level Cars Sales

Record Level Cars Sales

Record Level Cars Sales: రోజులు మారాయి. పెళ్లిళ్ల రేంజ్‌ కూడా పెరిగింది. అత్తింటివారు కొత్తల్లుడికి కట్నం కింద కార్లు ఇస్తున్నారు. ఒకప్పుడు మ్యారేజ్‌కి గిఫ్ట్‌ రూపంలో ఎక్కువగా లేటెస్ట్‌ మోడల్‌ బైక్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్‌ ఛేంజ్‌ అయింది. నూతన వధూవరులకి కాస్ట్‌లీ కానుకలుగా కార్లు బహూకరించేవారి సంఖ్య ప్రతి సంవత్సరంగా భారీగా వృద్ధి చెందుతోంది. దీంతో కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది నవంబర్‌తో పోల్చితే ఈ సంవత్సరం నవంబర్‌లో కార్ల కొనుగోళ్లలో 26 శాతం గ్రోత్‌ నెలకొంది.

ఒక వైపు.. ప్రపంచవ్యా్ప్తంగా చిప్‌ కొరత వేధిస్తోంది. మరో వైపు.. ఆర్థిక మందగమ భయాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాహన రంగంలో కార్లతోపాటు అన్ని విభాగాల్లో సేల్స్‌ పెరగటం పట్ల ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోయేషన్స్‌ హర్షం వ్యక్తం చేసింది. ఇండియన్‌ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ చరిత్ర మొత్తమ్మీద ఈ సంవత్సరం నవంబర్‌లో అత్యధిక రిటైల్‌ అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. అయితే.. దీనికి 2020 మార్చిలో జరిగిన సేల్స్‌ని మినహాయించాలి.

ఆ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి వాహనాల్లో భారత్ స్టేజ్‌ 6 అంటే.. బీఎస్6.. ఇంజన్‌లను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రిటైల్‌ సేల్స్‌ పెరిగాయి. ఇదిలాఉండగా.. ఏటా.. సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్య కాలంలో పండగ సీజన్‌లో కొత్త వెహికిల్‌ కొంటే మంచిదనే సెంటిమెంట్‌ ప్రజల్లో్ నెలకొనటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు దూసుకుపోతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ సంవత్సరం నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 14 వరకు పెళ్లిళ్ల సీజన్‌ అని, ఈ నెల రోజుల్లోనే 30 లక్షలకు పైగా వివాహాలు ఉన్నాయని పేర్కొన్నారు.

దీంతో టూవీలర్‌ మరియు ఫోర్‌ వీలర్ల విక్రయాలు బూస్ట్‌ అయ్యాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ శ్రుతి సబూ చెప్పారు. ఆర్బీఐ ఇటీవల రెపో రేటు పెంచటం వల్ల వెహికిల్‌ లోన్‌ కస్టమర్లపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ మార్కెట్లో కొత్త మోడల్‌ వెహికిల్స్‌ లాంఛ్‌ అవుతుండటంతో అమ్మకాలు తగ్గకపోవచ్చని యాడ్‌కౌంట్‌ మీడియా అనే మార్కెటింగ్‌ సంస్థ గ్లోబల్‌ మొబైల్‌ బిజినెస్‌ హెడ్‌ కుమార్‌ సౌరవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Show comments