Low Cost Electric Bike: ఈ రోజుల్లో ఏ బైక్ రేటు చూసినా కనీసం డెబ్బై ఎనభై వేలు చెబుతున్నారు. కానీ.. యులు అనే కంపెనీ.. విన్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్‌ని విడుదల చేసింది. ఈ బండి ధర కేవలం 55 వేల 555 రూపాయలు మాత్రమే కావటం విశేషం. ఈ టూవీలర్‌ని కొనుక్కోవాలనుకునేవాళ్లు 999 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ కట్టి ప్రిబుకింగ్ చేసుకోవచ్చు.
వచ్చే నెల నుంచి డెలివరీ లాంఛ్ కానుంది. ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బైక్ త్వరలో మరిన్ని ప్రధాన నగరాల్లో కూడా రానుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. యులు కంపెనీ తొలిసారిగా రూపొందించిన ఈ పర్సనల్ టూవీలర్ ఇప్పుడు రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.
AP Vehicle Sales down: బండ్లు కొనని ఆంధ్రులు
ఒకటి.. స్కార్లెట్ రెడ్ కలర్ కాగా రెండోది మూన్ లైట్ వైట్ కలర్. ఈ వాహనంలో 984 పాయింట్ మూడు వాట్‌ల సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 68 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. మ్యాగ్జిమమ్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే.
కాబట్టి.. దీన్ని నడపటానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ నంబర్ అవసరంలేదు. 16 ఏళ్ల వయసు దాటిన ప్రతిఒక్కరూ ఈ బైక్ రైడ్ చేయొచ్చు. కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా మొబిలిటీ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలను సైతం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెలకి 499 రూపాయల నుంచి 899 రూపాయల వరకు ఛార్జీలు ఉంటాయి.
దీనివల్ల రైడింగ్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. కిలోమీటర్‌కి 70 పైసల చొప్పున మాత్రమే ఖర్చవుతుంది. ప్రస్తుతం 55 వేల రూపాయలకే వస్తున్న ఈ బండి రేటు మరికొద్ది రోజుల తర్వాత దాదాపు పది వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే కొనుక్కోవటం బెటర్ అని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.