Low Cost Electric Bike: ఈ రోజుల్లో ఏ బైక్ రేటు చూసినా కనీసం డెబ్బై ఎనభై వేలు చెబుతున్నారు. కానీ.. యులు అనే కంపెనీ.. విన్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్‌ని విడుదల చేసింది. ఈ బండి ధర కేవలం 55 వేల 555 రూపాయలు మాత్రమే కావటం విశేషం. ఈ టూవీలర్‌ని కొనుక్కోవాలనుకునేవాళ్లు 999 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ కట్టి ప్రిబుకింగ్ చేసుకోవచ్చు.
Yulu Wynn: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది.. పెట్రో ధరలు ఆల్‌టైం హై రికార్డు సృష్టించిన తర్వాత.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.. పర్యావరణాన్ని సంరక్షించేందుకు కూడా పూనుకుంటున్నారు.. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నాయి.. ఇండియన్ మార్కెట్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతూ వస్తుంది.. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురాగా.. తాజాగా, యులు (Yulu) కంపెనీ వైన్ (Wynn) అనే ఎలక్ట్రిక్…