NTV Telugu Site icon

Byjus: ‘‘బైజూస్‌.. నీకింత బిల్డప్‌ అవసరమా?’’

Geee

Geee

Byjus: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఫుడ్‌బాలర్లలో లియోనెల్‌ మెస్సీ ఒకరు. ఆ స్టార్‌ ప్లేయర్‌ని ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ బైజూస్‌.. ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌’ అనే సామాజిక కార్యక్రమానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సంస్థ లేటెస్ట్‌గా తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. ‘2ఎక్స్‌’ ఫౌండర్‌ మరియు పబ్లిక్‌ స్పీకర్‌ రిషభ్‌ ధేడియా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు లింక్డిన్‌లో హాట్‌ హాట్‌గా పోస్టింగ్‌ పెట్టారు. బైజూస్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ‘మన దేశంలోనే అత్యంత నష్టదాయక స్టార్టప్‌’ అంటూ సెటైరికల్‌గా మొదలుపెట్టారు.

‘పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన సంస్థ.. లియోనెల్‌ మెస్సీ అంతటివాణ్ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంటోంది’ అని వెటకారం దట్టించి మరీ చెప్పారు. ‘‘బైజూస్‌ 2021లో కూడా 4 వేల 588 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. అదే సంవత్సరం.. అడ్వర్టైజ్‌మెంట్లకి, మార్కెటింగ్‌కి 2 వేల 500 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టింది. ఫిఫా వరల్డ్‌ కప్‌ అఫిషియల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం మరో 330 కోట్ల రూపాయలను వెచ్చించింది. ఓవరాల్‌ వర్క్‌ఫోర్స్‌ 50 వేలు కాగా అందులో 5 శాతం.. అంటే.. 2500 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

read more: Tata-Bisleri: బిస్లెరీ విషయంలో టాటా బొక్క బోర్లా ఖాయం

దీన్నిబట్టి మీకు ఏం అర్థమవుతోంది?. ప్రొడక్టు, స్టాఫ్‌ కాదు ముఖ్యం. మార్కెటింగ్‌కే మా మొదటి ప్రాధాన్యం. బిజినెస్‌ ఇమేజ్‌ని పెంచుకోవాలంటే మాకు ఇదే బెస్ట్‌ ఆప్షన్‌’’ అన్నట్లుగా ఆ స్టార్టప్‌ వ్యవహారశైలి ఉందని రిషభ్‌ ధేడియా చురకలంటించారు. ఈ తరహా సెల్ఫిష్‌ మెంటాలిటీకి ఇంతకు మించిన గ్రేట్‌ ఎగ్జాంపుల్‌ మరొకటి ఉండదన్నారు. ఆ ఎడ్‌టెక్‌ సంస్థలో సంపద విధ్వంసానికి ఇదొక స్పష్టమైన, తిరుగులేని నిదర్శనమని తేల్చిచెప్పారు. మరీ ఇంత ఘోరమా అనే అర్థంవచ్చేలా రిషభ్‌ ధేడియా.. బైజూస్‌పై ఫైర్‌ అయ్యారు. ఇదీ సంగతి. దీనిపై ఆ స్టార్టప్‌ యాజమాన్యం ఇంకెంత ఘాటుగా స్పందిస్తుందో చూడాలి.