Byjus: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఫుడ్‌బాలర్లలో లియోనెల్ మెస్సీ ఒకరు. ఆ స్టార్ ప్లేయర్‌ని ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్.. ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ అనే సామాజిక కార్యక్రమానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సంస్థ లేటెస్ట్‌గా తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. ‘2ఎక్స్’ ఫౌండర్ మరియు పబ్లిక్ స్పీకర్ రిషభ్ ధేడియా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు లింక్డిన్‌లో హాట్ హాట్‌గా పోస్టింగ్ పెట్టారు.