Best Food @ Millet Mantra: ఈ రోజుల్లో షుగర్, బీపీ వస్తే తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది రోజుకు మూడు పూటలు వరి అన్నమే తింటున్నారు. కొంతమంది టిఫిన్లు చేయటం ద్వారా రైస్‌ని రెండు పూటలకి పరిమితం చేసుకుంటున్నారు.
read more: OYO Rooms: సింగిల్ రూమ్‌తో మొదలుపెట్టి.. గ్లోబల్ రేంజ్‌కి..
ఉదయం అల్పాహారం, సాయంత్రం చపాతీలు తింటూ మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే అన్నం తినేవారి సంఖ్య కూడా ఈ మధ్య పెరుగుతోంది. అయితే.. బియ్యం, గోధుమల కన్నా కూడా బలమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నామని మిల్లెట్ మంత్ర అనే స్టార్టప్ సంస్థవాళ్లు చెబుతున్నారు.
న్యూజనరేషన్ కోసం న్యూట్రియెంట్ ఫుడ్‌కి రూపకల్పన చేసినట్లు ఆ కంపెనీ ఫౌండర్లలో ఒకరైన పూజితారెడ్డి తెలిపారు. అన్నం కన్నా.. ‘చిరుధాన్యం’ మిన్న అని పేర్కొన్నారు. రాగి, జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలతో రుచికరమైన ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ ‘మిల్లెట్ మంత్ర’లో దొరుకుతోందని అన్నారు.
జీరో కెమికల్‌తో తయారుచేసిన తమ ఉత్పత్తులు ఫాస్ట్ ఫుడ్‌కి ప్రత్యామ్నాయంగా బెస్ట్ ఫుడ్‌గా నిలుస్తున్నాయని వివరించారు. తక్కువ ధరల్లో ఎక్కువ పోషకాలతో కూడిన చక్కెర వాడని చక్కని ఆహారం మిల్లెట్ మంత్ర సొంతమని ధీమాగా చెప్పారు.
తమ ‘మిల్లెట్ మంత్ర’ను మన ‘ఆరోగ్య మంత్ర’గా అలవర్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పూజితారెడ్డితో ఎన్‌టీవీ బిజినెస్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..