Site icon NTV Telugu

Beautiful but Deadly Bird: చూసేందుకు అందంగా ఉన్న పక్షి.. పాములను చూస్తే మాత్రం..

Untitled Design (23)

Untitled Design (23)

పాములను చూస్తేనే మన గుండె జారీ పోతుంది. కానీ ఇక్కడున్న పక్షి.. ఎంత విషపూరితమైన పాములనైనా.. తన కాలి గోర్లతో చంపి తినేస్తుంది. చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఈ పాము.. పాముల పట్ల మృత్యువుగా మారింది. అయితే. .. ఈ పక్షికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Suicide: విషాదం.. చీమలకు భయపడి.. వివాహిత ఆత్మహత్య..

పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజానికి, ఈ పక్షి అత్యంత విషపూరితమైన పాములను కూడా చంపి.. క్షణాల్లో తినేస్తుంది. ప్రస్తుతం ఈ పక్షికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రజలు షాక్ అవుతున్నారు. పాములను చంపి తినే ఈ ప్రత్యేకమైన పక్షి పేరు సెక్రటరీ బర్డ్. ఇది వేటాడే జాతికి చెందిన పక్షి. మొదట ఆఫ్రికాలో కనిపించే ఈ పక్షి ఎక్కువ సమయం నేలపైనే గడుపుతుంది. ఈ పక్షి చూడటానికి చాలా అందంగా ఉన్నప్పటికీ, అత్యంత ప్రమాదకరమైనది. అందుకే దీన్ని ది ఆర్చర్ ఆఫ్ స్నేక్స్ అని కూడా పిలుస్తారు.

Read Also:Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే..

ఈ పక్షి పాములను పట్టుకోవడానికి తన పదునైన, శక్తివంతమైన కాళ్లను ఉపయోగిస్తుంది. ఈ పక్షి తన శరీర బరువుకు ఐదు రెట్లు ఎక్కువ శక్తితో కిక్ ఇవ్వగలదు. ఆ శక్తి సుమారు 195 న్యూటన్‌ల వరకు ఉంటుంది. కేవలం 15 మిల్లీసెకన్లలో ఈ కిక్‌తో పామును చంపి వేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన వారంతా.. షాక్ అవుతున్నారు. మనం పాములను చూసి.. భయపడితే.. ఈ పక్షిని చూసి భయపడి పారిపోతున్నాయని.. కామెంట్ల్ పెడుతున్నారు..

Exit mobile version