Exit Poll Results Tension In Ap: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కూడా క్లారిటీ లేకపోవడంతో అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఇంకొన్ని సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి. జాతీయ స్థాయిలో పేరొందిన సర్వేలు మాత్రం కూటమికే పట్టం కట్టాయి. వందకు పైగా సీట్లతో టీడీపీ కూటమి విజయకేతనం ఎగరవేయబోతున్నట్లు మెజార్టీ సర్వే సంస్థలు అంచనావేశాయి. ఎగ్జిట్‌పోల్స్ తర్వాత రాజకీయ పార్టీల మూడ్ మారినట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ తమకు అనుకూలంగా వస్తాయని భావించిన వైసీపీకి ఎదురుదెబ్బ తగిలిందనే ప్రచారం జరుగుతోంది.