ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో కేవలం ఇప్పటివరకు ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసిన ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా విజయం కోసం బాగా తపిస్తున్నాయి. అయితే గత మ్యాచ్ లో చెన్నైతో భారీ లక్ష్యాన్ని దగ్గర వరకు తీసుకెళ్లిన కోల్‌కత జట్టులో బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్ లో ఉండగా రాజస్థాన్ జట్టులో మాత్రం టాప్ ఆర్డర్ ఇబ్బంది పడుతుంది. ఇక బౌలింగ్ విషయంలో రెండు జట్లు ఒక్కే విధంగా ఉన్నాయి. కానీ గత మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. 170 కి పైగా లక్ష్యం ఉన్న ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఇక ఈరోజు జరిగే మ్యాచ్ లో ఈ రేడు జట్లలో ఎవరు గెలిచిన పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంటారు. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఎవరు ఎలా రాణిస్తారు అనేది.