ఆర్టీసీ అధికారులతో సోమేశ్ కుమార్ సమావేశం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాన్స్ పోర్టు, ఆర్టీసీ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపి , తిరిగి తెప్పించుటలో వేగాన్ని పెంచుటకై చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. మన రాష్ట్రమునకు ఒడిశాలోని అంగూర్ నుండి , కర్టాటక లోని బళ్లారి నుండి మెడికల్ ఆక్సిజన్ ను ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. రవాణా లో జాప్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో పాటు, మేకానిక్ లు,ఇతర నిపుణుల బృందాలను ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్లతో ప్రయాణించే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ కు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ సదుపాయాన్ని వినియోగించుటకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తద్వారా అంగూర్ కు ప్రయాణ సమయాన్ని ఆరు రోజుల నుండి మూడు రోజుల కు తగ్గించగలుగుతామని పేర్కొన్నారు.
కార్గో విమానాల ద్వారా సులభంగా ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించుటకు అనువుగా ట్యాంకర్లకు తగు మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. నిర్దేశిత పాయింట్లకు ఆక్సిజన్ ట్యాంకర్లను నడపుటకు 24 గంటలు పని చేసే విధంగా ఆర్.టి.సి. డ్రైవర్లు, మెకానిక్ ల బృందాలను ఏర్పాటు చేయాలని రవాణా అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రస్తుతం వున్న 30 ఆక్సిజన్ ట్యాంకర్లకు అదనంగా మరికొన్ని ట్యాంకర్లను సమకూర్చుకొనుటకు ప్రైవేట్ కాంట్రాక్టర్ల తో చర్చించాలని ఆదేశించారు.
Also Read
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..