NTV Telugu Site icon

రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ పై మీమ్స్ హల్చల్!

‘రాధేశ్యామ్ ‘ మూవీ విడుదల వాయిదా పడటంతో మీమ్స్ క్రియేటర్స్ కు చేతి నిండా పని దొరికినట్టు అయ్యింది. ఒక్కొక్కళ్ళూ తమ బుర్రలకు పదను పెట్టి, ‘రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ తో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఊహించి, మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో నింపేశారు.

మొన్న ‘ట్రిపుల్ ఆర్’ పోస్ట్ పోన్ కాగానే ఎన్టీయార్, రామ్ చరణ్‌ ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయ్యి ఉంటారో ఊహించుకుంటూ, ఇప్పుడు ప్రభాస్ అభిమానులదీ అదే స్థితి అన్నట్టుగా వాళ్ళను వీళ్ళనూ ఒకే గాటన కట్టేశారు.

పాన్ ఇండియా మూవీస్ ‘ట్రిపుల్ ఆర్’, ‘రాధేశ్యామ్’ రెండూ పోస్ట్ పోన్ కావడం, ముందుగా అనుకున్నట్టు సంక్రాంతి బరిలో కింగ్ నాగార్జున ‘బంగార్రాజు’ మూవీ రావడాన్ని కొందరు గొప్పగా చెబుతుంటే, మరికొందరు తట్టుకోలేక పోతున్నారు.

‘రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ అయ్యిందని ప్రభాస్ ఫ్యాన్స్ బాధపడుతుంటే, దానిపై వచ్చిన మీమ్స్ చూసి సగటు తెలుగు ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తున్నాడు.

సందట్లో సడేమియాలా ఇప్పుడు చిన్నా చితకా దాదాపు డజను సినిమాలు సంక్రాంతి సీజన్ లో జనం మీద దాడి చేయబోతున్నాయి. వీటిని మరి తెలుగు ప్రేక్షకులు ఎలా తట్టుకుంటారో చూడాలి. ‘రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ నేపథ్యంలో వచ్చిన మీమ్స్ ను మీరూ చూసి ఎంజాయ్ చేసేయండి!!